రానా దగ్గబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోస్ ఘనంగా ప్రారంభమైన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హీరో విక్టరీ వెంకటేష్, తొలి షాట్ కి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఊడుగులకి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి పాల్గొన్నారు.
వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ‘విరాట పర్వం’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ ల పై డి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గబాటి, డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, సాయిపల్లవి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, డైరెక్టర్స్ చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నటీనటులు:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి
నిర్మాతలు: సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఆర్ట్: నాగేంద్ర
ప్రొడక్షన్ డిజైనర్: లక్ష్మణ్ ఏలే
పబ్లిసిటీ డిజైన్:ధని ఏలే


