భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్

0
176
Bhargavi Nilayam - Neelavelicham - Streaming In AHA
Bhargavi Nilayam - Neelavelicham - Streaming In AHA

భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్

బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఓ రైట‌ర్‌. క‌థ రాయ‌డానికి స‌ముద్రం ఒడ్డున ఉన్న ప‌ల్లెటూరికి వ‌స్తాడు. ఊరి చివ‌ర ఉన్న భార్గవి నిల‌యం అనే పురాత‌న భ‌వంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ ఉంద‌ని అంద‌రూ చెప్పుకుంటారు. కొంద‌రు ఆ ఆత్మను నిజంగానే చూస్తారు. ఇంట్లో ఎవ‌రూ అడుగుపెట్టినా స‌హించ‌ని భార్గవి ఆత్మ బ‌షీర్‌ను మాత్రం ఏం చేయ‌దు. భార్గవి గురించి ఊరంద‌రూ ర‌క‌ర‌కాల క‌థ‌లు చెబుతారు. ఆమె చావు వెనుక ఉన్న అస‌లు నిజం ఏమిటో తెలుసుకొని దానినే క‌థ‌గా రాయాల‌ని బ‌షీర్ నిర్ణ‌యించుకుంటాడు? ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? అస‌లు భార్గ‌వి ఎలా చ‌నిపోయింది? భార్గ‌వి ప్రేమించిన శివ‌కుమార్ (రోష‌న్ మాథ్యూ) అదృశ్యం కావ‌డానికి కార‌ణం ఏమిటి? భార్గ‌వి మేన‌మామ నారాయ‌ణ‌న్ (టామ్ చాకో)…బ‌షీర్‌ను చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? అన్న‌దే “భార్గవి నిలయం” క‌థ‌. హర్రర్ సినిమా ఫీల్ తో పాటు మంచి ప్రేమ కథ కూడా ఇందులో చూపించారు.

జానర్: హారర్, రొమాన్స్, డ్రామా
నటీనటులు: టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో తదితరులు

Heroine Faria Abdullah – Photos Click Here >>>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here