ర‌ష్మిక మందన్నా ఛాలెంజ్ ని స్వీక‌రించి మొక్క‌లు నాటిన రాశిఖ‌న్నా

0
582
Raashi Khanna Plant sapling

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్చందంగా భాగమవుతున్నారు. తాజాగా ర‌ష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీక‌రించి మొక్క‌లు నాటారు హీరోయిన్ రాశీఖ‌న్నా. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అలాగే త‌న‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన ర‌ష్మిక మందన్నాకు థాంక్స్ చెప్పారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌మ‌న్నా భాటియాల‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు రాశీఖ‌న్నా. అంతే కాకుండా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అంద‌రూ భాగమై మొక్క‌లు నాటాల‌ని, ఈ చెయిన్‌ను ఇలాగే కొన‌సాగించాల‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here