రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్చందంగా భాగమవుతున్నారు. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు హీరోయిన్ రాశీఖన్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అలాగే తనను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన రష్మిక మందన్నాకు థాంక్స్ చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు రాశీఖన్నా. అంతే కాకుండా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అందరూ భాగమై మొక్కలు నాటాలని, ఈ చెయిన్‌ను ఇలాగే కొనసాగించాలని కోరారు.




