90 కోట్ల వ్యూస్‌ని సాధించిన రౌడీ బేబీ…

0
543
Rowdy Baby song views

త‌మిళ క‌థానాయ‌కుడు ధ‌నుశ్‌, సాయిపల్లవి జంట‌గా న‌టించిన చిత్రం ‘మారి 2’. ఈ మూవీలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో వ్యూస్ ప‌రంగా రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్‌గా ఈ పాటకు 900 మిలియ‌న్‌( 90 కోట్ల) వ్యూస్‌ను క్రాస్ చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటకి ప్రభుదేవా కోరియోగ్రఫీ చేశారు. ఆయ‌న కంపోజిష‌న్ ఎన్‌హెన్స్ చేస్తూ ధ‌నుశ్‌, సాయిప‌ల్ల‌వి అద్భుతంగా స్క్రీన్‌పై ప్రెజంట్ చేశారు. బాలాజీ మోహ‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వండ‌ర్ బార్ ఫిలింస్ ప‌తాకంపై ధ‌నుష్ నిర్మించారు. 2019, జనవరి 2వ తేదీన ‘రౌడీ బేబీ’ సాంగ్  యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

ఇదిలా ఉంటే సాయి పల్లవి గత సినిమాలలోని పాటలు కూడా యుట్యూబ్ లో మంచి రికార్డులను సృష్టించాయి.. ఫిదా సినిమా నుండి వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే సాంగ్, ఎంసీఏ చిత్రం నుండి మై డియర్ నాని పాటలు కూడా మంచి వ్యూస్ ని రాబ‌ట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here