ఉపాసనకు చెర్రీ విషెస్

0
423
Ramcharan Birthday wishes To His Wife

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న పుట్టిన‌రోజు ఈ రోజు (జులై 20). ఈ సంద‌ర్బంగా ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆమెకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న శ్రీమ‌తి ఉపాస‌న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ద‌యా హృద‌యంతో నువ్వు చేసే సేవా కార్యక్రమాలు చిన్న‌వైనా అవి ఎప్ప‌టికీ వృధాకావు. నువ్వు ఇలాగే మంచి పనులు చేసుకుంటూ వెళితే తప్పకుండా గుర్తింపు వస్తుంది. హ్యాపీ బర్త్‌డే`అంటూ చ‌ర‌ణ్ త‌న పోస్ట్‌లో తెలిపారు.

యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన. క‌రోనా విష‌యంలో ఉన్న అపోహ‌ల‌ను పోగొట్టి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే..2012 జూన్ 14న రామ్‌చ‌ర‌ణ్ ఉపాస‌న‌ వివాహం జ‌రిగింది. ఇటీవ‌లే వీరి వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్త‌య్యాయి. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాస‌న సోష‌ల్ స‌ర్వీస్‌కి సంబంధించిన ఫోటోలు, తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫోటోలు, చెర్రీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here