శ్రీలత సినీ క్రియేషన్స్ బేనర్ పై ఎస్.శ్రీలత నిర్మాతగా సురేష్ యడవల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’.విశాల్ వున్న,ప్రియాంక శర్మ,శ్రీలత,తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్ లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా…
నిర్మాత ఎస్.శ్రీలత మాట్లాడుతూ…’సరోవరం’ సినిమాను అందరూ ఇష్టపడితీశాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు, మీడియా వారికి ధన్యవాదాలు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.
డైరెక్టర్ సురేష్ యడవల్లి మాట్లాడుతూ…”సరోవరం” అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్ గా నడిచే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి మమ్మల్ని దీవించండి”అన్నారు.
జబర్దస్త్ నవీన్, రాము మాట్లాడుతూ – ” సరోవరం’ సినిమా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగింది. మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమేంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.
నటీనటులు:
విశాల్ వున్న,ప్రియాంక శర్మ,శ్రీలత,తనికెళ్ల భరణి,మేకా రామకృష్ణ,ఛత్రపతి శేఖర్,మహమ్మద్ ముస్తఫ,సంధ్య జనక్,మీనా కుమారి, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ రాము తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి….
సాంకేతిక నిపుణులు:
డిఓపి: మలహార్ భట్ జోషి
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
సంగీతం: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు
ప్రొడ్యూసర్: ఎస్.శ్రీలత
కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సురేష్ యడవల్లి


