ఫిట్ నెస్ లో బెస్ట్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. బేబీ ఎలా కనిపించినా నిమిషాల్లో ఇంటర్నెట్ ని హిటేక్కించడం కామన్. ఫిట్ నెస్ వరల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ అని పిలవబడే బేబీ రీసెంట్ గా ఇచ్చిన ఒక స్టిల్ చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆకాశానికి భూమికి మధ్య అందమైన ఏంజిల్ లా దర్శనమిచ్చింది.
అలా ఎలా నింగికెగిరావని నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్స్ అందమైన ప్రదేశాల్లో సరికొత్త స్టిల్ ఇస్తే రొటీన్ గానే ఉంటుంది అనుకుందేమో? అందుకే అందమైన ప్రదేశంలో తాను మరింత అందంగా కనిపించేలా పక్షిలా ఎగురుతూ దర్శనమిచ్చినట్లు ఉంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న రకుల్ తనకు ఇష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది.
షార్ట్ జీన్స్ లో నడుమందలను అలా తన స్కిల్స్ తో ప్రజెంట్ చేసి బెస్ట్ గర్ల్ అనిపించుకుంటోంది. ఏదేమైనా రకుల్ అటు ఫిట్ నెస్ ఇటు గ్లామర్ ని సమానంగా ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది.


