సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘దర్బార్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆయన పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మురుగదాస్ అన్ని రకాల కమర్షియల్ హంగులను కలగలిపి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా మోషన్ పోస్టర్ ని, తలైవా రజిని థీమ్ మ్యూజిక్ తో కలగలిపి రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించడం జరిగింది.
తమకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ బయటకు రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ శరణ్, నివేత థామస్, సునీల్ శెట్టి, యోగి బబు, నవాబ్ షా, శ్రీమాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏ సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు…..!!


