టిటిడి ఎస్వీబీసీ ఉద్యోగుల జీతాల విషయంలో చొరవ తీసుకొని గతంలో జీతాల ఇంక్రిమెంట్ పొందిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు

0
6
SVBC Employees Thank Chairman Sridhar Varma
SVBC Employees Thank Chairman Sridhar Varma

టిటిడి ఎస్వీబీసీ ఉద్యోగుల జీతాల విషయంలో చొరవ తీసుకొని గతంలో జీతాల ఇంక్రిమెంట్ పొందిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు

ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపికైన తర్వాత ఉద్యోగులతో కలిసి గత నెలలో తొలి మీటింగ్ లో పాల్గొన్న సమయంలో కొన్ని సమస్యలు బయటకి వచ్చాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు ఇంక్రిమెంట్ విషయం ఆయన గుర్తించి ఆ సమస్యను నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, ఎండోమెంట్ మినిస్టర్ ఆనం నారాయణ రెడ్డి గారి దృష్టికి, జిల్లా ఇంచార్జి అనగాని సత్య ప్రసాద్ గారి దృష్టికి తీసుకుని వెళ్లారు. అలాగే ఈ సమస్యను ఎస్వీబీసీ ఎండీ & టిటిడి ఈఓ ముద్దాడ రవి చంద్ర, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, టిటిడి ఎస్వీబీసీ సిఈఓ శరత్, తిరుపతి టిటిడి జెఈఓ ప్రభల గోపీచంద్ (విద్య, వైద్య) వారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చారు. గతంలో ఆగిపోయిన సాలరీ ఇంక్రిమెంట్ విషయంలో చొరవ తీసుకుని ఆ సమస్యను తీర్చే దిశగా వారు కృషి చేసి ఉద్యోగులకు గతంలో జీతాలు ఇంక్రిమెంట్ వచ్చేలా చేశారు. దీనికి గాను వారంతా సానుకూలంగా స్పందించారని ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ గారు ఎస్వీబీసీ ఎండీ & టిటిడి ఈఓ ముద్దాడ రవి చంద్ర గారికి, టిటిడి ఎస్వీబీసీ సిఈఓ శరత్, తిరుపతి టిటిడి జెఈఓ ప్రభల గోపీచంద్ (విద్య, వైద్య) గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్విబిసి ఉద్యోగులు అంత స్పందిస్తూ వారికి చాలా ఆనందకరంగా ఉందని, శ్రీధర్ వర్మ గారు వారి కోసం చాలా సానుకూలంగా స్పందిస్తున్నారని, ఆయన మొదటిగా అక్కడ స్థానిక మనిషి కావడం వారి గురించి శ్రీధర్ వర్మ గారికి వారి కష్టసుఖాలు తెలుసు అని హర్షం వ్యక్తం చేశారు. మొదటిగా ఆయన అక్కడ స్థానికుడు కావడంతో త్వరగా స్పందించి వారికి అండగా నిలవడం వారికి సంతోషంగా ఉందని ఆయనకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీధర్ వర్మ గారు కూడా ఈ సమస్య పై సానుకూలంగా స్పందించిన పలువురుకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here