చిరంజీవి–బాలకృష్ణ కాంబినేషన్‌ పై బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు

0
8
Director Boyapati Sreenu Visits Tirumala
Director Boyapati Sreenu Visits Tirumala

చిరంజీవి–బాలకృష్ణ కాంబినేషన్‌ పై బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు

దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించనున్న ‘అఖండ 3’ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కలిసి నటించే సినిమా గురించి కూడా తన ఆలోచనలను వెల్లడించారు. ‘అఖండ 3’కు సంబంధించిన కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులు, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలపై బోయపాటి శ్రీను తన తాజా వ్యాఖ్యల్లో స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే బాలకృష్ణ గారితో మాట్లాడానని అయితే దానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.

అదే సమయంలో పలువురు గతంలో చిరంజీవి గారు NBK50 ఈవెంట్ లో బాలకృష్ణ గారితో కలిసి సినిమా ప్లాన్ చేయమని స్టేజ్ మీద చెప్పిన విషయం గుర్తు చేస్తూ బోయపాటి గారిని ప్రశ్నించగా చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరితో కలిసి సినిమా చేయాలనే ఆలోచనపై కూడా ఆయన స్పందించారు. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే సినిమాలో చూపించడం తనకు కూడా ఆసక్తికరమైన విషయమేనని, సరైన కథ కుదిరితే ఈ కాంబినేషన్‌పై ఆలోచించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం వారు కంటిన్యూగా సినిమాలను చేయడంతో వారి అవకాశాన్ని బట్టి చూడాలని, అలా వాడితో కలిసి సినిమా చేయడం ఒక అదృష్టమని, చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని ఆయన అన్నారు.

బోయపాటి శ్రీను వ్యాఖ్యలు బాలయ్య, చిరంజీవి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన సందర్భంగా బోయపాటి శ్రీను మీడియా ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here