ది జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఆదివారం జరిగింది

0
2

పత్రికా ప్రకటన : 

జూబ్లీహిల్స్ లోని ది జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఆదివారం జరిగింది. ఉపాధ్యక్షుడు మసాడే లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 450 మందికి పైగా సభ్యులు హాజరు అయ్యారు. జర్నలిస్టులకు ఫోర్త్ సిటీ లో ప్రభుత్వం స్థలాలు కేటాయించే దిశగా అడుగులు వేయడాన్ని జనరల్ బాడీ అభినంధించింది. ఈ సందర్బంగా ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ, ఈ అంశం లో JCHSL తరుఫున అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహకరించాలని మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కార్యదర్శి, కోశాధికారి ప్రవేశ పెట్టిన నివేదికలు,తీర్మానాలను జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇండ్లు లేని జర్నలిస్టులకు స్థలాల కేటాయింపుకు మించి ముఖ్యమైన ఎజెండా అంశాలు ఏవీ లేవని సభ్యులు అంతా అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో jchsl అధ్యక్షుడు గోపరాజు, కార్యదర్శి రవీంద్రబాబు, సంయుక్త కార్యదర్శి Dr. చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు హష్మీ, కమలాకరా చార్య, సరస్వతి రమ లు పాల్గొన్నారు, సహకార శాఖ అధికారి మహ్మద్ ముబాషీర్ జనరల్ బాడీ పర్యవేక్షకులుగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ మెంబర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రిన్సిపాల్ వెంకన్న గారు, సొసైటీ సభ్యులకు సహకార సంఘాల పనితీరు, వాటి చట్టాలపై అవగాహన కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here