స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ “హనుమాన్ అంశ్” ఈ నెల 18న తెలుగులో థియేట్రికల్ రిలీజ్

0
8
Trivikram To Release Hanuman Ansh In Telugu
Trivikram To Release Hanuman Ansh In Telugu

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ “హనుమాన్ అంశ్” ను ఈ నెల 18న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకుంటున్న “హనుమాన్ అంశ్” సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 18న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు డా. విశాల్ చతుర్వేది “హనుమాన్ అంశ్” సినిమాను రూపొందించారు. రాగిని ఎస్, నమ్రత. జి. సింగ్, అనుప్రియ ఎ నగర్, డా.విశాల్ చతుర్వేది నిర్మించారు.

“హనుమాన్ అంశ్” సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ తేదీన బాలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం మరింతగా అంచనాలు పెంచుతోంది. తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో తెలుగులో “హనుమాన్ అంశ్” సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here