‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ ట్రైలర్ అదిరిపోయింది. కంటెంట్ లో మంచి ఎనర్జీ కనిపిస్తోంది. సినిమాపెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్

0
2
Newtons Third LawTrailer Launch Event
Newtons Third LawTrailer Launch Event

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ ట్రైలర్ అదిరిపోయింది. కంటెంట్ లో మంచి ఎనర్జీ కనిపిస్తోంది. సినిమాపెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మంచి థ్రిల్లర్‌. జులై 31న థియేటర్లలో సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. న్యూటన్స్‌ థర్డ్‌ లా ట్రైలర్ చాలా నచ్చింది. డైరెక్టర్ రాజేష్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. ఇలాంటి సినిమా తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌లో చాలా మంచి ఎనర్జీ ఉంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. నా ఫస్ట్ సినిమా నుంచి చాలా సపోర్ట్‌గా ఉన్నాడు. జగపతి బాబు గారు చాలా స్టైలిష్‌గా అనిపించారు. చాలా మంచి టీమ్‌తో వస్తున్న సినిమా ఇది. జులై 31న అందరూ కూడా ‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మళ్లీ రావా’ సినిమా తర్వాతసింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన కథ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేష్ ఈ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. ఈ సినిమాలో హీరో స్క్రీన్‌ప్లే. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంది. ప్రతి పాత్రకు కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. అదే ఆలోచించి ఈ సినిమాకు నేను అంగీకరించాను. మంచి థ్రిల్ ఉన్నా, వాటి సెంట్రల్ డ్రామా ఫ్యామిలీ చుట్టూనే ఉంటుంది. ఇది ఈటీవీ విన్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. రాజేష్ స్టైల్, కథ, స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఈ ట్రైలర్‌లో మేము చాలా తక్కువ కథనే చెబుతున్నాం. జులై 31న మీరు థియేటర్లకు వస్తే చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుంది. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ. జులై 31న తప్పకుండా మీరు ఈ సినిమాను ఇష్టపడతారు. అందరికీ థ్యాంక్యూ.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఈటీవీ విన్ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన కథలు చేశాం. అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అలాంటి మరో వైవిధ్యమైన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేష్ చాలా కొత్తరకం సినిమా చేశాడు. తను కచ్చితంగా చాలా మంచి దర్శకుడు అవుతాడు. ఈ సినిమా బాగా ఆడాలని, మాకు డబ్బులు రావాలని, అందరికీ సినిమాటిక్ హై రావాలని కోరుకుంటున్నాను. జులై 31న థియేటర్‌లో కలుద్దాం.

Watch Trailer Here

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ.. ఉషా కిరణ్ మూవీస్‌లో డిఫరెంట్ సినిమాలు చేసినట్టే, ఈటీవీ విన్ కూడా ఇప్పుడు బ్రాండ్‌ను బిల్డ్ చేసుకుంటూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తోంది. రాజేష్ ఈ కథను చాలా కొత్తగా చెప్పాడు. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, థ్రిల్లర్‌ను చాలా కొత్తగా ప్రజెంట్ చేసే సినిమా. జులై 31న మీరు చాలా కొత్త థ్రిల్లర్‌ను చూస్తారు. సుమంత్ గారు ఏ జానర్‌కైనా పర్ఫెక్ట్‌గా సరిపోతారు. అలాంటి యాక్టర్ మన ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం. జులై 31న అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

నేహా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. సుమంత్ గారితో పని చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. జగపతి బాబు గారు, అందరూ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది చాలా మంచి థ్రిల్లర్. ఇందులో చాలా ట్విస్టులు, టర్న్స్ ఉంటాయి. మా టీమ్ మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. జులై 31న థియేటర్‌లో కలుద్దాం.

నిర్మాత హరీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథను నమ్మిన సుమంత్ గారికి, ఈవిన్ కి పేరుపేరునా ధన్యవాదాలు. శేష్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. లిమిటెడ్ బడ్జెట్‌లో అద్భుతమైన సినిమాలు చేయడానికి ఆయన నాకు ఇన్‌స్పిరేషన్. ఈ సినిమాను కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశాం. అందరూ కూడా సినిమాపై నమ్మకంతో పని చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. 100 శాతం మీ అందరికీ నచ్చుతుంది.

దర్శకుడు రాజేష్ కర్ణ మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా తీయడానికి ఫ్రీడమ్ ఇచ్చిన ఈటీవీ విన్ సాయి గారికి, సుమంత్ గారికి, హరీష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మీకు హయ్యెస్ట్ కిక్ ఇస్తుంది. ఇంటర్వెల్‌కు మీకు పైసా వసూల్ ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. మహేష్ బాబు గారి ‘1 నేనొక్కడినే’ సినిమా వచ్చినప్పుడు ఫిల్మ్‌మేకింగ్ గురించి, దర్శకుడి గురించి చాలా చర్చ జరిగింది. అలాంటిదే ఈ సినిమా విషయంలో కూడా జరుగుతుంది. ఈ సినిమా గురించి కూడా చాలా మాట్లాడుకుంటారు. చాలా నమ్మకంగా చెబుతున్నాను. ‘న్యూటన్స్ థర్డ్ లా’ థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ.. చాలా మంచి సినిమా తీశాం. ఇది చాలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది. తప్పకుండా మీరందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇందులో పని చేసిన అందరూ కూడా అద్భుతంగా చేశారు. నటీనటులు అందరూ కూడా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

యాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ.. మా దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ప్రమోషన్స్ కూడా మేము యూనిక్‌గా చేస్తున్నాం. ఆడియన్స్‌కు సినిమా చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జులై 31న సినిమా వస్తుంది. మీకు బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సుమంత్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా మేమంతా తలెత్తుకుని చూసే సినిమా. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్‌కు, దర్శకుడికి, అందరికీ ధన్యవాదాలు. ట్రైలర్ అదిరిపోయింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

నటీనటులు: సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, త్రినాధ్ వర్మ, నేహా పఠాన్, షెల్లీ ఎన్ కుమార్, గౌతమ్ పండిట్, హరిణి రావు, రూపేష్ మర్రాపు, అభినయ

సిబ్బంది:
దర్శకత్వం- రాజేష్ కర్ణ
నిర్మాత – హరీష్ కోహిర్కర్
DOP – వేద వ్యాస్ గొట్టిపాటి
సంగీతం- సింజిత్ యర్రమిల్లి
ఎడిటర్ – అనిల్ పసల
యాక్షన్ డైరెక్టర్ – వింగ్ చున్ అంజి
ప్రొడక్షన్ డిజైనర్ – శివ కుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్ – మేఘనా శేషవపురి
సౌండ్ డిజైనర్ – మాణిక్క ప్రభు
మిక్సింగ్ ఇంజనీర్ – గౌరీ శంకర్
కలరిస్ట్ – ఆయుష్ శర్మ
లైన్ ప్రొడ్యూసర్ – కృష్ణ గూడెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాహుల్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here