ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్

0
4
Grand Blockbuster Success Meet for Chennai Love Story
Grand Blockbuster Success Meet for Chennai Love Story

ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్

-మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం నా కల తీరిన అనుభూతినిస్తోంది – డైరెక్టర్ రవి నంబూరి

-నివి పాత్ర బాగుందంటూ ప్రశంసల మెసేజ్ లతో నా ఫోన్ మోగుతూనే ఉంది – హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

-ప్రేక్షకుల స్పందన చూశాక సినిమా కోసం పడిన రెండేళ్ల కష్టం మర్చిపోయాం – కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

-“చెన్నై లవ్ స్టోరీ” తో సక్సెస్ కొట్టామని సంతోషంగా చెబుతున్నాను – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

-“బేబి” కంటే “చెన్నై లవ్ స్టోరీ” గొప్ప సినిమా, ప్రేక్షకులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం – స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్

-నాపై నమ్మకంతో థియేటర్స్ కు వెళ్తూ, మా ప్రేమ కథపై ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు – హీరో కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది “చెన్నై లవ్ స్టోరీ” సినిమా. ప్రీమియర్స్, వరల్డ్ వైడ్ గా డే 1 వసూళ్లు కలిపి ఈ సినిమా 12.3 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ విశ్వాస్ డేనియల్ మాట్లాడుతూ – మా “చెన్నై లవ్ స్టోరీ” సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటూ ప్రశంసలు వస్తున్నాయి. విజువల్స్ కు మంచి గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది. అన్నారు.

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – ప్రేమ సారాన్ని చెప్పిన సినిమా ఇది. మిలియన్స్ వ్యూస్ కోసం, అవార్డ్స్ కోసం పాట రాస్తుంటాం. కానీ ఈ సినిమా కోసమే పాటలు రాశాను. మా సినిమా చూశాక ప్రేక్షకులు చెమ్మగిల్లిన కళ్లతో, బరువెక్కిన హృదయంతో థియేటర్స్ నుంచి బయటకు వెళ్తున్నారు. వాళ్లను చూసి మా టీమ్ కూడా అదే భావోద్వేగానికి లోనవుతున్నాం. అన్నారు.

నటుడు మహేందర్ మాట్లాడుతూ – మా సినిమాలో కిరణ్ గారు, గౌరి గారి పర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాకు మేము 50 రోజులు పనిచేస్తే, వాళ్లు రెట్టింపు టైమ్ వర్క్ చేశారు. మా సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం సంతోషంగా ఉంది. అన్నారు.

నటి ప్రమోదిని మాట్లాడుతూ – ఒక సినిమా హిట్ అయ్యింది అనే మాట వినడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ టీమ్ పడిన శ్రమకు ప్రతిఫలం దక్కింది కదా అనిపిస్తుంది. ప్రేక్షకులంతా ఈ ప్రేమ కథను ప్రేమిస్తున్నారు. మంచి విజయం అందించారు. అన్నారు.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ – మా సినిమా షూటింగ్ టైమ్ లోనే డైరెక్టర్ రవి నంబూరి పెద్ద దర్శకుడు అవుతాడని చెప్పాను. అలాగే సాయి రాజేష్ గారు నేషనల్ అవార్డ్ కోసం మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందేమో. హీరోలు మూడు హిట్స్ కొడితే ప్రేక్షకుల మనుసుల్లో సుస్థిరమైన సంపాదించుకుంటారు. కిరణ్ అబ్బవరం ఆ ఘనత సాధించాడు. ఇంకో 30 ఏళ్లు ఆయన కెరీర్ కు ఢోకా లేదు. తెలుగమ్మాయి గౌరి అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. మా ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ చెప్పినట్లే చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎలాంటి డీవియేషన్ లేకుండా గీతాంజలి, సఖి, 96 లాంటి ప్యూర్ లవ్ స్టోరీ చేయడం కష్టం. చెన్నై లవ్ స్టోరీతో సక్సెస్ ఫుల్ గా అలాంటి సినిమా చేశారు మా టీమ్. ఈ సినిమాకు నాది ఉడత సాయమే. కానీ నా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – తన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా కల నిజమైన సంతోషం కలుగుతుంది. నేనూ అలాంటి హ్యాపీనెస్ నే ఎంజాయ్ చేస్తున్నా. మా మూవీకి మంచి టాక్ తో పాటు బుకింగ్స్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే రైటర్, డైరెక్టర్ ఎలాంటి స్ట్రగుల్స్ పడతాడు అనేది ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందని అనుకున్నా కానీ ఎమోషన్ ఏదైనా ఏమోషనే కాబట్టి ప్రేక్షకులు స్టీవెన్ క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతున్నారు. కిరణ్ అన్న పర్ ఫార్మెన్స్ గురించి అందరూ ఒక మాట ఎక్కువ మాట్లాడితే సంతోషిస్తా అనుకునేవాడిని. నేను ఆశించినట్లే ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించి బాగా చెబుతున్నారు. కిరణ్ అన్న సీన్స్ కొన్ని చిత్రీకరిస్తున్నప్పుడే ఇవి స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని నమ్మాను. గౌరి పర్ ఫార్మెన్స్ ను అందరూ ప్రశంసిస్తుంటే నన్ను పొగిడినట్లు అనిపిస్తోంది.

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – ఇది నా లైఫ్ లో చాలా ముఖ్యమైన రోజు. మా అమ్మ ఇక్కడ ఉంటే బాగుండేది. కానీ తను చూస్తోంది అనుకుంటున్నాను. నాన్న నా విజయానికి ఎంతో సంతోషిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో, మల్టీప్లెక్స్ ల్లో ఆడియెన్స్ మా మూవీ చూస్తూ ఒకేలా రియాక్ట్ అవుతున్నారు. పెద్దలు, యువత, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ మా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. హాల్ లో చూస్తే అన్ని ఏజ్ గ్రూప్స్ ఆడియెన్స్ ఉండటం సంతోషాన్నిస్తోంది. ప్రేక్షకులందరినీ ఒక్కటి చేసేది మంచి సినిమా అనిపించింది. నిన్నటి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ప్రశంసలతో మెసేజ్ లు వస్తున్నాయి. అమ్మాయిలు చాలా మంది మేసేజ్ లు పంపుతున్నారు. అమ్మాయి ప్రేమ కథ కోణంలో సినిమాను తెరకెక్కించిన మా మేకర్స్ కు థ్యాంక్స్. ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీ రాసిన సాయి రాజేష్ గారికి, అంతే అద్భుతంగా తెరకెక్కించిన రవి నంబూరి గారికి థ్యాంక్స్. ఎస్ కేఎన్ గారు సినిమా పట్ల ఒక పసిపిల్లవాడికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమను, ఒక పరిణితి గల ప్రొడ్యూసర్ కు ఉన్న అనుభవాన్ని ఒకేసారి చూపిస్తుంటారు. ఒక జంట మీదే కథ సాగాలంటే ఎంతో ఆసక్తికరంగా సన్నివేశాలు ఉండాలి, ఆ సన్నివేశాలను ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేయగలగాలి. కిరణ్ గారి లాంటి మంచి కోస్టార్ వల్లే అలాంటి మంచి పర్ ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. అన్నారు

కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా సినిమాకు ప్రేక్షకుల స్పందన చూశాక సినిమా కోసం పడిన రెండేళ్ల కష్టం మర్చిపోయాం. అందరూ సినిమాను పిక్నిక్ లా చేశామని అంటారు. ఈ సినిమా షూటింగ్ అలా జరగలేదు. చాలా ఒత్తిడి, శ్రమ, ఎఫర్ట్స్ పెట్టి చేశాం. అంత ఈజీగా షూటింగ్ జరగలేదు. మా మూవీకి మహిళా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని ముందే ఊహించాం. మేము అనుకున్నట్లే వుమెన్ మా మూవీని ఇష్టపడుతున్నారు. సినిమా చూసి ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. మా టీమ్ అందరికీ ఈ సినిమా సక్సెస్ ను అంకితం చేస్తున్నాను. కిరణ్ అబ్బవరం గారు లేకుంటే ఈ సినిమా లేదు. ఈ టీమ్ తో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. మీ సోదరి, తల్లి, స్నేహితురాలు, మీ ప్రేయసి ఎవరితో అయినా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమా కోసం మేము ఎంత కష్టపడినా రిలీజ్ రోజు ప్రేక్షకుల స్పందనే అవన్నీ మరిపించే సంతోషాన్నిస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఒక చెట్టు ఫలాలు ఇవ్వాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాగే సినిమాకు మేము పడిన కష్టానికి ఫలితం దక్కిందనే సంతోషం ఇలాంటి వేదికల మీదే పంచుకుంటాం. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. మూవీకి పనిచేసే ప్రతి ఒక్కరూ తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అలా అందరి ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటుకా ఇటుకా పేర్చి ఇళ్లు కట్టినట్లు సినిమా చేయడానికి చాలా కష్టపడాలి. క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్స్ కు అది సులువేమో గానీ నాలాంటి కంటెంట్ రిచ్ ప్రొడ్యూసర్స్ కు కష్టం. అందుకే 2018లో టాక్సీవాలా చేశాను, 23లో బేబి చేశాను, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నిర్మించాను. నేను సాయి రాజేష్ భిన్న ధ్రువాల్లాంటి వాళ్లం. మాలో బేధాభిప్రాయాలు ఉంటాయి. కానీ సినిమా కోసం మేము ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం. చెన్నై లవ్ స్టోరీ కథను 20 నిమిషాలు సాయి రాజేష్ చెప్పాడు. అదిరిపోయింది వెంటనే చేద్దామని అనుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల ఆలస్యమైంది. బేబి సినిమా విజయం మాపై మేకర్స్ గా బరువు బాధ్యతలు పెంచాయి, తర్వాత మేము చేసే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అందుకే మరింత యూనివర్సల్ అప్పీల్ ఉండేలా ఈ సినిమాను నిర్మించాం. అప్పట్లో బాలచందర్, భారతీరాజా గారి కథల్లా సాయి రాజేష్ గారి కథల్లో డెప్త్ ఉంటుంది. పాత్రలు బలంగా ఉంటాయి. అందుకే ఆయనకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సాయి రాజేష్ పట్ల గర్వపడుతుంటాను. హీరో కిరణ్ గారితో సహా మేమంతా బలంగా నమ్మి చేసిన చిత్రమిది. డైరెక్టర్ రవి నా సోదరుడు నా మంచిని కోరుకునేవాడు. సాయి రాజేష్ కు కూడా చాలా ఇష్టం. రవి మా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ రోజు సంతోషంగా చెబుతున్నా మేము మరోసారి సక్సెస్ అందుకున్నాం. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్స్ చేసి షోస్ పెంచుతున్నాం, కలెక్షన్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఫస్ట్ డే 12.3 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. బేబి మూవీ ఓపెనింగ్ కంటే దాదాపు 40 పర్సెంట్ ఎక్కువ వచ్చింది. కిరణ్ గారి క, కె ర్యాంప్ రెండూ కలిపి ఓపెనింగ్ డే ఎంత చేశాయో మా సినిమా అంత కలెక్ట్ చేసింది. ఇది కిరణ్ గారికి బిగ్గెస్ట్ హ్యాట్రిక్ అని చెప్పాలి. ఆయన బ్యాంకబుల్ హీరో అనేది తెలుసు. అలాగే పర్ ఫార్మర్ గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. నిజంగా కిరణ్ గారు ఒరిజినల్ స్టార్. నేను విజయ్ తో టాక్సీవాలా చేసినప్పుడు డే 1 బ్రేక్ ఈవెన్ అయ్యింది. అలాగే ఆనంద్ గారి కెరీర్ లో బేబి బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది. కిరణ్ గారితోనూ అలాంటి విజయాన్నే అందుకున్నాం. మమ్మల్ని నమ్మి పనిచేసే హీరోకు కమర్షియల్ గా రేంజ్ పెంచడంలోనే వారి పట్ల మా ప్రేమను ప్రదర్శిస్తున్నాం. కిరణ్ గారితో వర్క్ చేసి ఆయనకు అభిమానిగా మారాను. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎంత బలంగా ఉంటుంది అని చెప్పడమే కల్ట్. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్లినా మళ్లీ తిరిగి వస్తాడు అది క్లాసిక్. ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ కలర్ ఫొటో, బేబి అనే ట్యాగ్ పై ఉన్న నమ్మకాన్ని మా చెన్నై లవ్ స్టోరీ నిలబెట్టింది ఆ సంతృప్తి మాకు చాలు. సరసమైన టికెట్ ధరలో మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీ ప్రేక్షకులు, యువతులు బ్రహ్మరథం పడతారు అని మా సినిమా ప్రూవ్ చేస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకులు తప్పకుండా వస్తారు. గౌరి పర్ ఫార్మెన్స్ కు నివి నివి అంటూ థియేటర్స్ లో అరుపులు వినిపిస్తున్నాయి. కిరణ్ గారి గురించి వచ్చే ఈవెంట్స్ లో ఇంకా చెబుతాను. అన్నారు

స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – ఒక మంచి సినిమాకు నేచర్ అంతా సపోర్ట్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమా విషయంలో అది మరోసారి నా అనుభవంలో చూశాను. డైరెక్టర్ రవి ఈ సినిమా కోసం పడిన కష్టానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. నేనూ ఒక ఏడీగా ఆయనకు ఎక్కడైనా అవసరం ఉంటే సహకారం అందించాను. మణిశర్మ గారి టీమ్ కూడా అర్థరాత్రి ఈ మూవీ కోసం వర్క్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రవిని పూర్తిగా నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇవ్వొచ్చని నమ్మాం. నేను కథా రచయితను అయినా నాకంటే ఎక్కువగా ఈ కథను ప్రేమించి, అర్థం చేసుకుని సినిమా రూపొందించాడు. నేను దర్శకుడిని అయినా ఇంత బాగా తెరకెక్కించేవాడిని కాదేమో. బేబి సినిమా తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమానే చేయాలని అనుకున్నాం. బేబి కంటే చాలా గొప్ప సినిమా చేశాం. హిట్ సినిమా చేయాలనే సంకల్పం ఒక్కటే నన్ను, ఎస్ కేఎన్ నూ ముందుకు నడిపిస్తుంటుంది. సినిమా మీద ఏ రూపాయి వచ్చినా తిరిగి సినిమాకే పెట్టుబడి పెడుతుంటాడు ఎస్ కేఎన్. ధీరజ్ ఈ సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడు. మాపై ఏమాత్రం ఒత్తిడి పడనీయలేదు. అలాంటి మిత్రుడు దొరికినందుకు సంతోషంగా ఉంది. ఎంతోమంది హ్యాపెనింగ్ హీరోయిన్స్ ఈ కథను వద్దనుకున్నారు. లవర్ సినిమా చూసి ఈ అమ్మాయి కదా మన నివి అనిపించింది. గౌరి ఎంతో డెడికేటెడ్ గా ప్రతిభావంతంగా నివి పాత్రను పోషించింది. కిరణ్ గారు ఈ సినిమా కోసం 24 గంటలూ కష్టపడ్డారు. అలాంటి హీరో దొరకడం దర్శకుడిగా రవి అదృష్టం. ఆ అదృష్టం నాకూ దక్కాలని కోరుకుంటున్నా. కిరణ్ గారు ఈ సినిమా సొంత సినిమా అనుకుని వర్క్ చేశారు. నా కథలోని ఆత్మ ప్రతిబింబించేలా పాటలు రాస్తారు అనంత శ్రీరామ్. ఈ సినిమాకూ అలాంటి మంచి సాహిత్యాన్ని అందించారు. నా స్నేహితుడు త్రిగుణ్ నా మాటను నమ్మి ఈ క్యారెక్టర్ చేశారు. మీడియా మిత్రులు మా మూవీని ఎంతో సపోర్ట్ చేశారు. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా సినిమాకు పనిచేసిన ప్రతి క్రాఫ్ట్ లోని మెంబర్ కు థ్యాంక్స్. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే వారితో చెప్పేవాడిని ఇది మనందరికీ మంచి సినిమా అవుతుందని. ఆ మాట నిజమై ఈ రోజు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించడం సంతోషంగా ఉంది. అనంత శ్రీరామ్ గారు గుర్తుండిపోయే పాటలు రాశారు. విశ్వాస్ నాతో వర్క్ చేసిన నాలుగో సినిమా ఇది. బ్యూటిఫుల్ విజవల్స్ ఇచ్చారు. కథ సినిమా నుంచి త్రిగుణ్ అన్న హీరోగా చేస్తున్నారు. మా మూవీలో ఎలాంటి ఈగోస్ లేకుండా పాజిటివ్ గా ఉంటూ మాకు సపోర్ట్ చేశారు. ధీరజ్ అన్న సినిమా మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఒకేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రంలో నివి పాత్రను పర్ ఫార్మ్ చేయడం కష్టం. నివి ఈ పాత్రను పోషించేందుకు చాలా కష్టపడింది. ఆమె కష్టం చూశాక ఈ ఆమ్మాయికి మంచి పేరు రావాలని కోరుకున్నా. ఆమెకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు dssచూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా చేసేప్పుడు అందరితో రవి గురించి చెప్పేవాడిని. ఈ సినిమాతో రవికి విజయం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా. స్టీవెన్ శంకర్ అనే గుర్తుండిపోయే పాత్రను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. సినిమా పట్ల ఒక చిన్న పిల్లాడి ఎగ్జైట్ మెంట్ ఎస్ కేఎన్ లో చూశాను. సినిమా పట్ల తపన ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. మేము ఏదైనా ప్రెజర్ లో ఉంటే వచ్చి సరదాగా మాలో ఉత్సాహం నింపేవారు. బేబి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత టైమ్ తీసుకుని ఒక మంచి మూవీ చేయడం అంత ఈజీ కాదు. హిట్ కొట్టాలి బ్రదర్, మంచి సినిమా చేయాలనే ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఏడాదిన్నర క్రితం సాయి రాజేష్ గారు కలిసి ఈ కథ చెప్పారు. ఆయన ఆ రోజు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఈ రోజు ప్రేక్షకులు ఇచ్చిన విజయంతో నిజమైంది. నాలో స్టీవెన్ శంకర్ ను చూసి, నాపై నమ్మకం పెట్టుకున్నందుకు సాయి రాజేష్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులు మా సినిమా మీద చూపిస్తున్న ప్రేమకు, నా మాట మీద చూపించిన నమ్మకానికి కృతజ్ఞతలు. మీకు మూవీ తప్పకుండా నచ్చుతుందని నేను రిలీజ్ ముందు చెప్పాను. ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించడం సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్స్ కు వచ్చి చూస్తున్నారు. కొందరు థియేటర్స్ లో సినిమా చూస్తూ ఉద్వేగానికి లోనవుతున్నారు. స్టీవెన్ శంకర్ రోల్ స్క్రిప్ట్ విన్నప్పుడు నాలో కొంత సందేహం ఉండేది. హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సినిమా చేయడం కరెక్టా కాదా అనిపించేది. కామెడీ, యాక్షన్ చేయగలం కానీ ఇంత ఇన్నోసెంట్ గా, ఎమోషనల్ గా నటించి మెప్పించగలనా లేదా అనిపించేది. నాకు సాధ్యమైనంత పర్ ఫార్మ్ చేశాను. ఈ రోజు మీడియా మిత్రుల దగ్గర నుంచి, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మా ప్రేమ కథపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. మాది కొత్త ప్రేమ కథ. థియేటర్స్ కు వెళ్లి ఎక్సిపీరియన్స్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ చూడండి. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్, సిరి హన్మంతు, మహేందర్, నరేష్, పూజ, ప్రమోదిని, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేష్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here