ఘనంగా మెగా బ్రదర్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

0
4
Nagababau took part in Benaka Gold aanual celebrations
Nagababau took part in Benaka Gold aanual celebrations

ఘనంగా మెగా బ్రదర్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

బెనాక గోల్డ్ సంస్థ యాన్యువల్ సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. మెగా బ్రదర్ నాగబాబు, జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు జరిగిన బెనాక గోల్డ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ లో నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న భరత్, ఆయన టీమ్ కు నాగబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా

బెనాక గోల్డ్ భరత్ మాట్లాడుతూ – నాగబాబు గారు మా ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తుంటారు. ఆయన లాంటి వండర్ ఫుల్ పర్సన్ సపోర్ట్, గైడెన్స్ మాకు లభించడం సంతోషంగా ఉంది. మీ అందరి నమ్మకాన్ని పొంది ఈ రోజు మా సంస్థ యాన్యువల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మీ గోల్డ్ ను సేల్ చేసుకోకండి, సేవ్ చేసుకోండి అనేది మా సంస్థ ద్వారా ఇస్తున్న సూచన. అన్నారు.

యంగ్ డైరెక్టర్ దీపక్ ఆవుల మాట్లాడుతూ – బెనాక గోల్డ్ కోసం యాడ్ చేయాలని అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాం. అప్పుడు మాకు అనిపించిన ఒకే ఒక సెలబ్రిటీ నాగబాబు గారు. ఆయన అయితేనే ఈ యాడ్ కు బాగుంటుందని నిర్ణయించాం. నాగబాబు గారితో బెనాక గోల్డ్ యాడ్ కు డైరెక్షన్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఆయన ద్వారా ఈ సంస్థకు మంచి ప్రచారం లభిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

మెగా బ్రదర్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ – బంగారం అనేది మా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒక భాగం. మధ్య తరగతి కుటుంబ సభ్యులు, పేద వారు కూడా కొంతైనా బంగారం దాచుకోవాలని ప్రయత్నిస్తారు. కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవసరంలో ఆ బంగారం మనల్ని ఆదుకుంటుందనే నమ్మకం కూడా వారిలో ఉంటుంది. బంగారానికి మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. శుభాకార్యం చేయాల్సిన వచ్చినా, మరేదైనా అవసరంలో బంగారం కుదవపెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ఆ బంగారం విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారి బంగారాన్ని విడిపించి, అప్పుడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం విలువగట్టి, ఆ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లించే సౌకర్యాన్ని బెనాక గోల్డ్ సంస్థ కల్పిస్తోంది. ఈ వివరాలన్నీ భరత్ చెప్పినప్పుడు పేద, మధ్య తరగతి వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అనిపించింది. అందుకే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ముందుకొచ్చాను. ఈ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here