హవీష్ కి సినిమా అంటే చాలా పాషన్. ‘కొంచెం కొంచెం’ పాట చాలా బావుంది. ‘నేను రెడీ’ సినిమా పెద్ద విజయం సాధించాలి: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి

0
2
Romantic Number Konchem Konchem From Nenu Ready Turns Up The Heat
Romantic Number Konchem Konchem From Nenu Ready Turns Up The Heat

హవీష్ కి సినిమా అంటే చాలా పాషన్. ‘కొంచెం కొంచెం’ పాట చాలా బావుంది. ‘నేను రెడీ’ సినిమా పెద్ద విజయం సాధించాలి: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి

‘నేను రెడీ’ నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది:  హీరో హవిష్

హవిష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రీ ‘నేను రెడీ’ నుంచి అదిరిపోయే రొమాంటిక్ ‘కొంచెం కొంచెం’ సాంగ్ లాంచ్

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’ ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట ‘కొంచెం కొంచెం’ను లాంచ్ చేశారు.

మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ‘కొంచెం కొంచెం’ రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. పాటలోని రొమాంటిక్ మూడ్‌ను అందంగా ప్రజెంట్ చేసిన ట్యూన్‌తో పాటు, మ్యూజిక్ అరేంజ్‌మెంట్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. సమీరా భరద్వాజ్  తన మెలోడీ వోకల్స్ తో పాటలోని భావాలను మరింత అందంగా పలికించారు.

ఈ పాటలో హవీష్, కావ్యా థాపర్ మధ్య కనిపించే రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.  బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ స్పెషల్ అప్పియరెన్స్‌తో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆమె గ్లామర్‌తో పాటు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ కూడా పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆకట్టుకునే ట్యూన్, సరదా సాహిత్యం, మెలోడీ వోకల్స్, స్టైలిష్ విజువల్స్‌తో ‘కొంచెం కొంచెం’ పూర్తి స్థాయి రొమాంటిక్ సాంగ్‌గా అలరిస్తోంది.

‘నేను రెడీ’ మ్యూజికల్ జర్నీకి ‘కొంచెం కొంచెం’ బ్లాక్‌బస్టర్ ఆరంభాన్ని ఇచ్చింది. విడుదలైన వెంటనే ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. క్యాచీ ట్యూన్, ఆకట్టుకునే విజువల్స్, హవీష్-కావ్యా థాపర్ కెమిస్ట్రీ ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. యూత్‌ను ఆకట్టుకునే ఈ పాట రాబోయే రోజుల్లో మ్యూజిక్ ప్లేలిస్ట్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

 

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో హవీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన బాబీ గారికి, కేఎల్ నారాయణ గారికి ధన్యవాదాలు. వాళ్లు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నాకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ త్రినాథరావు గారు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు (నవ్వుతూ). నా వరకు యాక్టింగ్‌లో అన్నిటికంటే కష్టమైనది రొమాన్స్ చేయడమే. త్రినాథరావు గారు ఈ కథ చెప్పినప్పుడే నేను చాలా ఎంటర్‌టైన్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. నాకు నటన అంటే చాలా ఇష్టం. నటనలోనే నాకు సంతృప్తి ఉంటుంది. ఈ సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది, పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ ఏడాది వచ్చే బెస్ట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన బాబీ గారికి, కేఎల్ నారాయణ గారికి ధన్యవాదాలు. నర్గీస్ ఫక్రీ గారితో ఎప్పటినుంచో  ఒక సినిమా చేయాలనే వుండేది. ఇందులో సాంగ్ కోసం నర్గిస్ ఫక్రీ పేరు చెప్పగానే మా నిర్మాతలు వెంటనే అంగీకరించారు. నర్గిస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ పాట సినిమాలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ టీమ్ అందరికీ సినిమా చూపించాం.  ఎందుకంటే మా సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మైత్రి శశిధర్ గారు కూడా ఇది ‘నక్కిన మార్క్’ సినిమా అని అన్నారు. రామజోగయ్య శాస్త్రి గారు రెండు గంటల్లో అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా సింగర్స్ కూడా అద్భుతంగా పాడారు. హవీష్ చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. మేమంతా ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ తీశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఈ సినిమాకు మీ అందరూ పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నాను.”

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సత్యనారాయణ గారు మాకు కుటుంబ సభ్యుల్లాంటి వారు. త్రినాథరావు గారు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు పెట్టింది పేరు. ‘నేను లోకల్’, ‘ధమాకా’లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్ అందించారు. ఈ సినిమా కూడా అలాంటి మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. హవిష్ గారు చాలా వినయంగా ఉంటారు. ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా వెంటనే చేస్తారు. నక్కిన గారి కథల ఎంపిక కూడా చాలా బాగుంటుంది. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ఆల్ ది బెస్ట్. శశి గారు ఒక సినిమాను తీసుకున్నారు అంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

కేఎల్ నారాయణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సత్యనారాయణ గారితో మాకు కుటుంబ సభ్యుల్లాంటి అనుబంధం ఉంది. హవీష్‌కు సినిమా అంటే ఎంతో ప్యాషన్, కమిట్‌మెంట్. ఈ పాట చూశాను, చాలా అద్భుతంగా ఉంది. హవీష్‌కు ఈ సినిమాతో పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. త్రినాథరావు గారు ఎంటర్‌టైనర్ సినిమాలకు పెట్టింది పేరు. కచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను.

నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. కేఎల్ నారాయణ గారికి, బాబీ గారికి థ్యాంక్యూ. వాళ్లు మాకు కుటుంబ సభ్యుల్లాంటి వారు. ఈ కథను హవీష్ గారు మొదటి సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఏడాది లోపే ఈ సినిమాను పూర్తి చేశాం. హవీష్‌కు నటన అంటే చాలా ఇష్టం. యాక్టింగ్‌లోనే ఆయనకు సంతృప్తి ఉంటుంది. త్రినాథరావు గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కన్నుల పండుగలా ఉంటుంది. అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందించాం. మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కుటుంబం మొత్తం కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాకు మీ అందరి ఆశీర్వాదాలతో పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను.”

కావ్యా థాపర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేయడం నాకు చాలా మంచి అనుభవంగా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా నుంచి ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ఇందులోని పాటలు, సినిమా మీ అందరికీ తప్పకుండా ఎంతో నచ్చుతాయని నమ్ముతున్నాను.”

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాం. త్రినాథరావు నక్కిన గారి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. వాటిని ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి పాట కూడా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు అన్ని పాటలను ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా మంచి పాయింట్‌ను తీసుకున్నారు. ప్రతి పాత్రకు సరైన నటీనటులను ఎంపిక చేశారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

నటీనటులు: హవీష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రీ (స్పెషల్ సాంగ్), బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలం, సత్యనారాయణ, రోహన్ రాయ్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here