“పెద్ది” చరణ్ ని ప్రశంసించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

0
12
FCA Congratulates Ram Charan For Peddi Success
FCA Congratulates Ram Charan For Peddi Success

“పెద్ది” చరణ్ ని ప్రశంసించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

“పెద్ది” చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, తనదైన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్”తో… ప్రపంచవ్యాప్తంగా గల భారతీయ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించింది. ప్రీమియర్స్’తో పాటు తొలి నాలుగు రోజుల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించి… ఐదో రోజైన సోమవారం కూడా అసాధారణమైన కలెక్షన్లతో దూసుకుపోతూ “పెద్ది” సాధిస్తున్న సంచలన విజయం పట్ల తెలుగు ఫిలిం క్రిటిక్స్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్షన్స్ పరంగా ఫ్లయింగ్ కలర్స్ తో “మండే టెస్ట్” పాసవ్వడమే కాకుండా… పెర్ఫార్మన్స్ పరంగా “తండ్రికి తగ్గ తనయుడిగా” జేజేలందుదుకుంటున్న రామ్ చరణ్ పై వారు ప్రశంసల వర్షం కురిపించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, జనార్దన్ రెడ్డి, నాగేంద్ర కుమార్, కుమారస్వామి, కేశవ, అప్పాజీతోపాటు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here