కోర్టు ఆదేశాల ద్వారా అయినా మూవీ టీమ్ కలలు, డబ్బు, హార్డ్ వర్క్ కాపాడబడటం సంతోషంగా ఉంది – హీరో విజయ్ దేవరకొండ

0
49
Vijay Deverakonda
Vijay Deverakonda

కొందరి కుట్రలకు సినిమా బలి కాకుండా కోర్టు నుంచి రక్షణ దక్కడం సంతోషంగా ఉంది – హీరో విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్స్ లో రివ్యూస్, రేటింగ్స్ ఇవ్వకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కావాలని సినిమాను బ్యాడ్ చేయాలనుకునే వారి కుట్రలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఈ విషయంపై స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. ఒకవైపు సంతోషంగా, మరోవైపు బాధగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. ఒక సినిమాకు మూవీ టీమ్ పెట్టే హార్డ్ వర్క్, డబ్బు, వారి కలలను ఇలా కోర్టు ఆర్డర్ ద్వారా రక్షించుకోవడం సంతోషంగా ఉందని, అయితే మన వాళ్లే ఇలా మన సినిమాలకు పనిగట్టుకుని చెడు చేయాలని చూడటం బాధగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు.

విజయ్ దేవరకొండ స్పందిస్తూ – మనమంతా కలిసి ఎదగాలని, మరొకరికి మంచి చేస్తూ జీవించాలనే స్ఫూర్తి ఏమై పోయింది. మన వాళ్లే మన సినిమాలకు చెడు చేయడం బాధగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఇలాంటి వాళ్ల వల్ల ప్రమాదంలో పడుతుందని కోర్టు వారు అర్థం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల ద్వారా అయినా మూవీ టీమ్ కలలు, డబ్బు, హార్డ్ వర్క్ కాపాడబడటం సంతోషంగా ఉంది. డియర్ కామ్రేడ్ సినిమా టైమ్ నుంచి నా సినిమాలను దెబ్బ తీయాలనే కొందరు చేసే రాజకీయాలు, కుట్రలను తెలుసుకున్నాను. కొన్నేళ్లుగా నేను మాట్లాడింది ఎవరూ గ్రహించలేకపోయారు. మంచి సినిమాను ఏ కుట్ర ఆపలేదని నేను చెబుతూ ఉండేవాడిని. నాతో సినిమాలు చేసే దర్శక, నిర్మాతలకు ఈ సమస్యలు ఎంత ప్రమాదమైనవో తెలుస్తూ వచ్చింది. వీళ్లంతా ఎవరు, ఎందుకు సినిమాలపై కుట్ర చేస్తున్నారు, వీళ్ల నుంచి సినిమాలను ఎలా రక్షించుకోవాలి అనే ఆలోచనలతో చాలా రాత్రులు నిద్రపోలేదు. నేనే కాదు నా తర్వతా వచ్చే హీరోలు కూడా ఇలాంటివే ఎదుర్కొంటారని అనిపించేది. కొన్ని గ్యాంగ్స్ సినిమాలపై చేసే కుట్రలు ఎంత ప్రమాదకరమో కోర్టు వారు గుర్తించారు. ఇది మొత్తం సమస్యలను పరిష్కరించకున్నా ఒక ముందడుగు అని భావించవచ్చు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో పాటు మిగతా చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాలి, పండుగ సెలవుల్లో మనందరినీ ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here