మంత్రులతో కలిసి ‘పూలే’ చూసిన సీఎం

0
58
Telangana CM Revanth Reddy Watched Phule Along With Ministers
Telangana CM Revanth Reddy Watched Phule Along With Ministers

మంత్రులతో కలిసి ‘పూలే’ చూసిన సీఎం

సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వీక్షించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత , ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకున్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే ప్రజాప్రతినిధులందరూ బస్సులో ప్రయాణించడం విశేషం. సీఎం ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత కల్పించారు.అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం గతేడాది ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిత్రంలో జ్యోతిరావు పూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి పూలేగా పత్రలేఖ పాల్ నటించారు. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు చేసిన పోరాటాన్ని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. సామాజిక సంస్కర్తల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here