ప్రేక్షకుడు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో నిర్మాతకు మిగిలేది 17 శాతమే – క్లారిటీ ఇచ్చిన ఎస్ కేఎన్
టికెట్ రేట్ల పెంపు, తినుబండారాల ధరలతో నిర్మాతలు ప్రేక్షకుల్ని దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వింటూనే ఉంటాం. దీనిపై క్లారిటీ ఇచ్చారు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ప్రేక్షకులు సినిమాకు పెట్టే ఖర్చులో నిర్మాతకు ఎంత మిగులుతుందో డీటెయిల్డ్ గా గ్రాఫ్ తో సహా వివరించారు. ప్రేక్షకుడు సినిమా కోసం పెట్టే ప్రతి రూపాయి ఖర్చులో నిర్మాతకు కేవలం 17 పైసలు మాత్రమే మిగులుతోందని లెక్కలతో సహా వివరించారు.

మిగతా డబ్బులన్నీ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి, ప్రభుత్వ పన్నులకు, టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ ..ఇలా మేజర్ వాటా వెళ్లిపోతోందని, ఇక మిగిలిన 17 శాతం మాత్రమే నిర్మాతకు దక్కుతోందని ఎస్ కేఎన్ వెల్లడించారు. ఒక ఫ్యామిలీ సినిమా చూసేందుకు ఖర్చు చేసే రూ. 2,178లో నిర్మాతకు దక్కేది కేవలం రూ. 372 మాత్రమేనని ఎస్ కేఎన్ చెప్పారు. కష్టపడి దర్శకుడిని పట్టుకొని కథ చేయించుకొని హీరో ని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఇంత తక్కువ ఆదాయం వస్తుంటే ప్రేక్షకుల్ని దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు చేయడం సరికాదని ఎస్ కేఎన్ క్లారిటీ ఇచ్చారు.



