‘భైరవం’తో తెలుగులోకి రావడం  డ్రీమ్  కం ట్రూ మూమెంట్. ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ చేశాను. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరోయిన్ అదితి శంకర్

0
328
Aditi Shankar About Bhairavam
Aditi Shankar About Bhairavam

‘భైరవం’తో తెలుగులోకి రావడం  డ్రీమ్  కం ట్రూ మూమెంట్. ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ చేశాను. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరోయిన్ అదితి శంకర్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితి శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
నేను తమిళ్ లో చేసిన తొలి సినిమాని డైరెక్టర్ విజయ్ గారు చూశారు. భైరవంలో క్యారెక్టర్ కు నేనైతే యాప్ట్ గా ఉంటుందని భావించారు. ఆయన కాల్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. అలా ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది.

ఇది మీ ఫస్ట్ తెలుగు సినిమా కదా… ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు?
-లాంగ్వేజ్ పరంగా ఒక బ్యారియర్ ఉంటుందని ముందుగా భావించాను. అయితే మా డైరెక్టర్, రైటర్ సత్య చాలా హెల్ప్ చేశారు. వారి హెల్ప్ తో ఈ జర్నీ చాలా స్మూత్ గా జరిగింది.  

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?  
-ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్, అదే సమయంలో బబ్లీగా ఉండే క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ కి దగ్గరగానే ఉంటుంది.

-మా నాన్నగారితో కలిసి రామోజీ ఫిలిం సిటీ, తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సొంత సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం ఒక డ్రీం కం ట్రూ మూమెంట్. నాకు తెలుగులో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఇలాంటి మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రావడం చాలా ఆనందం ఇచ్చింది.

మీరు ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు?  
-కథ, అందులో నా క్యారెక్టర్ బాగుంటే కచ్చితంగా చేస్తాను

Aditi Shankar About Bhairavam
Aditi Shankar About Bhairavam

మీ నాన్నగారు ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ గారు కదా.. మీరు ఒక హీరోయిన్ గా మిమ్మల్ని నిరూపించుకోవడానికి ఎలాంటి ఛాలెంజ్ ఎదుర్కొంటారు?
-రియల్లీ ఇది నైస్ ఛాలెంజ్. నాన్నగారి ఇమేజ్ ని ఒక గౌరవంగానే భావిస్తాను కానీ అది ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను.

ఇది మల్టీ స్టార్ సినిమా కదా.. ముగ్గురు హీరోలతో మీ జర్నీ ఎలా ఉండేది?
-ఇది రియల్లీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. మనోజ్ గారు నాకు తెలుసు. ఆయన నన్ను సెట్ లో చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగారు. తర్వాత ఈ సినిమాలోని నటిస్తున్నానని చెప్పాను. అది రియల్లీ ఫన్ మూమెంట్. సాంగ్ సూట్ సమయంలో ఫస్ట్ టైం సాయి గారిని కలిసాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ కి రోహిత్ గారు కూడా చాలా నైస్ పర్సన్. ఈ ముగ్గురికి తమిళ్ మాట్లాడడం తెలుసు. సో ఈ జర్నీ చాలా కంఫర్టబుల్గా జరిగింది. ముగ్గురు అద్భుతంగా పెర్ఫాం చేశారు  

మ్యూజిక్ గురించి ?
శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి అద్భుతంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మరో పాట కూడా రాబోతుంది. ఆ పాట కూడా చాలా వండర్ఫుల్ గా ఉండబోతుంది. నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. ఇందులో రెండు డాన్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా నాకు వెరీ ఫేవరెట్.

మీరు తెలుగు సినిమాలు చూస్తుంటారా? మీ ఫేవరేట్ మూవీ ?  
-చూస్తాను. నా ఫేవరెట్ మూవీ మగధీర. ఎందుకంటే నేను ఫస్ట్ థియేటర్లో చూసిన తెలుగు సినిమా అది. అలా రాజమౌళి గారికి రామ్ చరణ్ గారికి నేను బిగ్ ఫ్యాన్ గా మారిపోయాను.

Aditi Shankar About Bhairavam
Aditi Shankar About Bhairavam

మీ నాన్నగారు మీరు చేస్తున్న కథలు వింటారా?
-లేదండి. మా నాన్నగారికి నేను చేస్తున్న సినిమాలు, వాటికి సంబంధించిన కథలు ఏమీ తెలియదు. మా అమ్మగారికి ప్రతిదీ చెప్తుంటాను. మా నాన్నగారు ఆయన సినిమాలతో ఆయన బిజీగా ఉంటారు. అలాగే ఆయన సినిమాలకు సంబంధించిన విశేషాలు కూడా ఏమి చెప్పరు. ఆయన సినిమాని ఒక పసిపాప లాగా జాగ్రత్తగా చూసుకుంటారు.

మీ నాన్నగారు మీ సినిమాలు చూస్తారా?
-ఆయనకి మరో ఆప్షన్ లేదు. ఆయన నా సినిమాలు చూడకపోతే ఆయనతో ఫైట్ చేస్తాను( నవ్వుతూ)

నిర్మాత గురించి?
-రాధమోహన్ గారు ప్రతిరోజు సెట్ కి వచ్చేవారు. తన షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేసేవారు. ఆయన చాలా నైస్ పర్శన్.

డైరెక్టర్ విజయ్  కనకమేడల గురించి?
-ఆయన చాలా మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్ లో చాలా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఆయనకి ఆర్టిస్టుల నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ రాబట్టు కోవాలో తెలుసు. ఆయన క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్.

మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
-నాకు హిస్టారికల్, పిరియాడిక్ సినిమాలు చేయాలని ఉంది. అలాగే ఛాలెంజింగ్ విమెన్ క్యారెక్టర్స్ చేయాలని వుంది.

Aditi Shankar About Bhairavam
Aditi Shankar About Bhairavam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here