అట్లాంటా ఉగాది ఉత్స‌వాల్లో హీరోయిన్ జో శ‌ర్మ

0
20
Jo Sharma At Atlanta Ugadi celebrations
Jo Sharma At Atlanta Ugadi celebrations

అట్లాంటా ఉగాది ఉత్స‌వాల్లో హీరోయిన్ జో శ‌ర్మ

▪️ అట్లాంటా మ‌హాన‌గ‌రంలో ఘ‌నంగా ఉగాది వేడుక‌
▪️ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా వేదిక‌
▪️ సెలబ్రిటీ గెస్టుగా పాల్గొన్న M4M హీరోయిన్ జో శ‌ర్మ

తెలుగు వారి తొలి పండగ ఉగాది అమెరికాలో ఘ‌నంగా జ‌రిగింది. అట్లాంటాలోని డెన్మార్క్ హైస్కూల్ ప్రాంగణంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో జ‌రిగిన‌ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుక‌ల్లో M4M (Motive For Murder) మూవీ హీరోయిన్ జో శ‌ర్మ సెలబ్రిటీ గెస్టుగా పాల్గొని సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ వేదిక‌పై జో శ‌ర్మ‌ను TAMA అసోసియేష‌న్ స‌భ్యులు స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా M4M (Motive For Murder) మూవీ హీరోయిన్ జో శ‌ర్మ మాట్లాడుతూ.. ”ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష‌లు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) సంస్థ నిర్వ‌హ‌కులు జ‌రిపిన ఈ వేడుక‌ల‌కు న‌న్ను సెలబ్రిటీ గెస్టుగా ఆహ్వానించినందుకు కృతజ్ఞ‌త‌లు. అచ్చ‌మైన తెలుగు సంస్కృతి ఇక్క‌డ ఆవిష్కృత‌మైంది. బంతి భోజ‌నాలు పెట్ట‌డం ఎంతో ఆనంద‌మేసింది. 30 ర‌కాల తెలుగు వారి రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో అరిటాకులో భోజ‌నం వడ్డించ‌డం ఎంతో సంతృప్తి అనిపించింది. కొండ‌ప‌ల్లి నుంచి క‌ళాకారుల స్వ‌హ‌స్తాల‌తో త‌యారు చేసిన‌, గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించే విధంగా ఉన్న మెమోంటోల‌ను అందించారు. TAMA అధ్య‌క్షుడు రూపేంద్ర వేముల‌ప‌ల్లి గారికి, చైర్మ‌న్ రాఘ‌వ త‌డ‌వ‌ర్తి గారికి, TAMA సంస్థ‌లోని ప్ర‌తి మెంబ‌ర్‌కి పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు” అని తెలిపారు.

ఈ వేడుక‌లో జో శ‌ర్మ‌తో పాటు క‌మీష‌న‌ర్ టాడ్ లెవంట్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, దుగ్గిరెడ్డి, స్పాన్స‌ర్స్, TAMA స‌భ్యులు, వంద‌లాది ఎన్నారై కుటుంబాలు పాల్గొని విజ‌య‌వంతం చేశారు. తెలుగు ఎన్నారైల ఆటాపాట‌ల మ‌ధ్య‌, ఆనందోత్స‌హాల మ‌ధ్య జ‌రిగిన ఈ వేడుక సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here