అర్జున్ S/O వైజయంతి అందరికీ కనెక్ట్ అయ్యే మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది: డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

0
34
Arjun Son Of Vyjayanthi Director Pradeep Chilukuri
Arjun Son Of Vyjayanthi Director Pradeep Chilukuri

అర్జున్ S/O వైజయంతి అందరికీ కనెక్ట్ అయ్యే మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది: డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్,  ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్  ప్రదీప్ చిలుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఆలోచన ఎలా వచ్చింది? కళ్యాణ్ రామ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు?  
-కళ్యాణ్ రామ్ గారితో సినిమా చేయాలని ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. అప్పటికే కళ్యాణ్ రామ్ గారు డెవిల్ అమిగోస్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఉన్నారు. ముందుగా మాస్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాము. మాస్ జోనర్ లో హీరో క్యారెక్టర్ ని తయారు చేశాను. తర్వాత ఒక పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్ ని అనుకున్నాం. ఈ మదర్ వైజయంతి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ముందు హీరో గారికి చెప్పాం. ఆయన చేద్దాం అన్నారు కానీ విజయశాంతి గారు ఒప్పుకుంటేనే చేద్దాం అని క్లియర్ గా చెప్పారు. విజయశాంతి గారికి కథ చెప్పాం. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సెట్స్ మీద తీసుకువెళ్లాం.  

ఇందులో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఏమిటి ?
– హీరో క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్ ఎవరి ఐడియాలజీలో వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. అక్కడి నుంచే కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్.

-విజయశాంతి గారు ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా చేశారు. విజయశాంతి గారు కథ విన్నప్పుడే తాను ఫైట్స్ కి సిద్ధమని చెప్పారు.  

మీరు రాజా చెయ్యి వేస్తే సినిమా చేశారు ఆ తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం?
– కథలు ఓకే అయ్యాయి. ఒక పెద్ద హీరో సినిమాకి అడ్వాన్స్ లు ఇచ్చి కూడా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగాం. అలాగే యువీ క్రియేషన్ లో ఒక కథ కోసం మూడేళ్లు పాటు కూర్చున్నాం. అది నెక్స్ట్ చేయబోతున్నాం. అలాగే అనిల్ సుంకర బ్యానర్ లో ఏడాదిన్నర పాటు ఒక కథ మీద వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయినా పెద్ద సినిమాలౌతాయి.

Arjun Son Of Vyjayanthi Director Pradeep Chilukuri
Arjun Son Of Vyjayanthi Director Pradeep Chilukuri

ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు అది ఎలా ఉండబోతుంది?
-మదర్ కోసం ఎంత త్యాగం చేయొచ్చు అది ఆడియన్స్ చూస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది.  

సినిమా బిజినెస్ ఎలా ఉంది ?
-చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకి చాలా మంచి బజ్ ఉంది .

ఎన్టీఆర్ గారు కళ్యాణ్ అన్న కాలర్ ఎగరేస్తాడు అని చెప్పారు ఆ నమ్మకం ఎలా వచ్చింది ?
-ఎన్టీఆర్ గారు సినిమా చూశారు. చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ అది.

సాయి మంజ్రేకర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఎమోషనల్ యాక్షన్ ఫిలిం ఇది.  అలాంటి సీరియస్ ఫిలిం లో కాస్త కూల్ బ్రీజా ఉండే క్యారెక్టర్ తనది. తన కరెక్ట్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది.  

ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ? ఎలా డిజైన్ చేశారు ?
-విజయశాంతి గారి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ పృథ్వి మాస్టర్ చేశారు.  రామకృష్ణ మాస్టారు ఇంటర్వెల్, క్లైమాక్స్ రెండు ఫైట్లు చేశారు పీటర్ మాస్టర్  హీరో ఇంట్రడక్షన్ క్లైమాక్స్ ఫైట్ చేశారు. విలన్ సీక్వెన్స్ రెండు రఘువరణ్ మాస్టర్ చేశారు. ఫైట్లన్నీ చాలా అద్భుతంగా వుంటాయి.  

విజయశాంతి గారు కథని ఒప్పుకున్న తర్వాత కచ్చితంగా మీ మీద ఒక బాధ్యత, అదే సమయంలో భయం కూడా ఉంటుంది కదా?
-భయం ఏమి లేదండి. కాన్ఫిడెంట్ గా గా చెప్పాం. కాన్ఫిడెన్స్ గా చేశాం. నిజానికి విజయశాంతి గారిని నేనే ఇబ్బంది పెట్టాను. ఇందులో ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్లో ఓ రెండు గంటల పాటు అడవిలోని బురదలో అలాగే ఉండిపోయారు. షాట్ పూర్తి అయ్యేవరకు అలాగే బురదలో పడుకున్నారు. ఆ సీన్ ఫినిష్ చేసి  కార్వాన్ లోకి వెళ్ళిన తర్వాత  మేడం గారికి ఫుల్ గా జ్వరం వచ్చింది. చేయి వణుకుతుంది. జ్వరం ఉన్నప్పటికీ కూడా ఆ సీన్ అయ్యేవరకు అక్కడ నుంచి కదల్లేదు. అంతా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.  మేడం గారి సీనియార్టీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఆవిడ పర్ఫామెన్స్ చూసిన తర్వాత చాలా చోట్ల నాకు గూస్ బంప్స్ వచ్చాయి. వేరే లెవల్లో పెర్ఫార్మన్స్ చేశారు.  కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు పోటీపడి యాక్ట్ చేశారు.  

Arjun Son Of Vyjayanthi Director Pradeep Chilukuri
Arjun Son Of Vyjayanthi Director Pradeep Chilukuri

ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎలా ఉంది?  
-ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తీశారు. ఎక్కడ వెనకడుగు వేయలేదు. అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు.
 
అజినీస్ గారి మ్యూజిక్ గురించి?
-రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారికి విలన్ కి ప్రతి క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ సౌండ్ ట్రాక్ ని క్రియేట్ చేశారు.  

కళ్యాణ్ రామ్ గారి స్ట్రెంత్ ఏంటి ?  
-ఆయన బలం ఎమోషన్.  ఎమోషన్ ని అదరగొట్టేస్తారు.  

ఈ కథలో మెయిన్ ఎమోషన్ ఏమిటి?
-తల్లితండ్రులు మన  బర్త్ డే ని ఒక సెలబ్రేషన్స్ లా చేస్తారు.  తల్లిదండ్రుల బర్త్ డే ని మనం సెలబ్రేట్ చేయడం ఒక ఎమోషన్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను.  

కళ్యాణ్ రామ్ గారు,  ఎన్టీఆర్ గారి ఫాన్స్ ఈ సినిమా నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
-అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా ఇది.  అభిమానులు మంచి ఎమోషన్ ని ఆశించవచ్చు.

మీ బలం ఏమిటి?
-ఎమోషన్ నా బలం.  నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఎమోషనల్ గానే ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here