లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) రివ్యూ
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ చాలా ఏళ్ళ విరామం తర్వాత నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ పతాకాలపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయక్తంగా నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ప్రధాన తారాగణం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ:
కిషోర్ (ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. సిద్ధూ బీటెక్ కుర్రాడు. స్నేహితులతో కలిసి సరదాగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. సిద్ధు తండ్రి కిషోర్ అనాథలకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తుంటాడు. పుట్టుక తర్వాత మనిషి జీవితంలో చావు కీలకమైనదని, దానికి గౌరవం ఇవ్వాలన్నది కిషోర్ సిద్ధాంతం. కొడుకు సిద్ధు ఏ తప్పు చేసినా పల్లెత్తు మాట కూడా అనడు కిషోర్. స్వీటీ (కషిక కపూర్) ని ప్రేమిస్తాడు సిద్ధు. కొడుకు ప్రేమకు కిషోర్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. హ్యాపీగా సాగిపోతున్న ఈ తండ్రీకొడుకుల జీవితాల్లోకి గ్యాబ్లింగ్ మాఫియా కింగ్ కబీర్ (నవాబ్ షా) ఎంట్రీ ఇస్తాడు. హార్స్ రైడింగ్, క్యాసినో బిజినెస్ చేసే కబీర్…కిషోర్, సిద్దులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తాడు. ప్రజల్లో వారికి ఉన్న మంచి పేరును చెడగొడతాడు. కిషోర్, సిద్ధులపై కబీర్ పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి? తండ్రి కోసం కబీర్‌పై సిద్ధు ఎలాంటి పోరాటం సాగించాడు? సిద్ధూ, కిషోర్ ఎందుకు కాశీ వెళ్లారు? అఘోరాలకు వారి రివేంజ్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ
నటీనటుల పనితీరు:
తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బావుంది. రెగ్యులర్ ఆర్టిస్ట్స్ చేసినట్టు కాకుండా కొత్తగా ట్రై చేశారు. తండ్రీగా సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. డ్యాన్స్ బాగా చేశారు. కాన్సంట్రేట్ చేస్తే మంచి ఆర్టిస్ట్ అవుతాడు. చరణ్, శ్రీహర్ష కాంబినేషన్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కషికా కపూర్ గ్లామర్ ఆడియన్స్ నోటీస్ చేస్తారు. అఘోరా పాత్రలో ఛత్రపతి శేఖర్ క్యారెక్టర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రఘుబాబు, ప్రవీణ్, షకలక శంకర్, భద్రం తదితరులు కామెడీ చేశారు.నవాబ్ షా విలనిజం కమర్షియల్ సినిమా తరహాలో ఉంది.
సాంకేతిక నిపుణుల పనితీరు:
దర్శకుడిగా పవన్ కేతరాజుకు ఇదే మొదటిమూవీ. కథకుడిగా మెప్పించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ‘లవ్ యువర్ ఫాదర్’కు బలం. శివుని నేపథ్యంలో ఆయన చేసిన పాట, శివ భక్తుల సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్ బంప్స్ ఇస్తాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.మణిశర్మ సాంగ్స్, ఆర్ఆర్, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ భారీ బడ్జెట్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. డైలాగ్స్ మీద మరింత వర్క్ చేసుంటే బాగుండేది. కామెడీపై కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.
విశ్లేషణ:
‘అఖండ’, ‘కార్తికేయ 2’ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు మైథాలజీ పాయింట్ టచ్ చేసినవి కన్పిస్తాయి. డివోషనల్ టచ్ ఉన్న ఫాంటసీ ఫిలిమ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. ‘లవ్ యువర్ ఫాదర్’ కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా.
‘లవ్ యువర్ ఫాదర్’ సినిమాలో డివోషనల్ పాయింట్ ఉంది. అది కథలో అది మేజర్ పార్ట్. దాన్ని డామినేట్ చేసేలా ఎక్కువ స్క్రీన్ టైమ్ కాలేజీ ఎపిసోడ్ తీసుకోవడంతో ఇంటర్వెల్ ముందు అసలు కథలో కీలకమైన ఘట్టం మొదలు అవుతుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత డైవర్ట్ చేసినా నవ్విస్తాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. రెగ్యులర్ అన్పించే కామెడీ సీన్స్, కాలేజీ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే డివోషనల్ సీన్స్ హై ఇస్తాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది.
కమర్షియల్ హంగులతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమాల కోసం చూసే ఆడియన్స్ ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) వైపు చూడవచ్చు. కొంత ల్యాగ్, రొటీన్ సీన్స్ ఉన్నా డివోషనల్ పాయింట్, క్లైమాక్స్ ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తాయి. శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తాయి.
రేటింగ్: 3/5
చివరగా: డివోషనల్ టచ్ తో అలరించే ఎమోషనల్ స్టోరీ