సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి గారికి నివాళులు అర్పించిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి…

0
55
Veteran Actress Producer Krishnaveni
Veteran Actress Producer Krishnaveni

సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి గారికి నివాళులు అర్పించిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి…

నటి, నిర్మాత కృష్ణవేణి గారు తన 102వ యేట హైదరాబాద్ ఫిలింనగర్ లోని తమ నివాసంలో కన్ను మూశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంగిడిలో 1923 డిసెంబర్ 24న జన్మించారు. సతీ అనసూయ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. 1940వ సంవత్సరంలో మీర్జాపురం రాజా అయిన మేకా రంగయ్య గారిని వివాహం చేసుకుని ఆ తర్వాత నిర్మాతగా మారారు. నందమూరి తారక రామారావు గారిని “మనదేశం” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆమె మరణానికి నివాళులు అర్పించారు. అటువంటి ఒక గొప్ప నిర్మాత మరణ వార్త తమ హృదయాలను కలచివేసిందని తమ ఆవేదనను తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here