ఘనంగా పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహ మహోత్సవం

0
141
AbhinayTej Wedding
AbhinayTej Wedding

ఘనంగా పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహ మహోత్సవం, హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్, మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 12.37 నిమిషాలకు సుముహూర్తంలో అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

అభియన్ తేజ్, అక్షత వివాహ వేడుకలో అతిథులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, రుడా(రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీసీసీ ఛైర్మన్ శ్రవణ్ కుమార్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, యాక్టర్స్ వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివ బాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీశ్ శంకర్, తదితరులు పాల్గొని నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు.

AbhinayTej Wedding
AbhinayTej Wedding

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here