‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా రివ్యూ

0
46

‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా రివ్యూ

తన స్వీయ దర్శక నిర్మాణంలో సత్య రెడ్డి హీరోగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటనను ఆధారంగా తీసుకొని ప్రజలందరికీ తెలియాలని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో ప్రజా నౌక, గాయకుడు, విప్లవకారుడు అయిన గద్దర్, పల్సర్ బైక్ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మ శ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల తదితరులు కీలకపాత్రను పోషించారు. విచిత్రానికి శ్రీ కోటి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Satya Reddy Starrer Ukku Satyagraham
Satya Reddy Starrer Ukku Satyagraham

కథ:

ఆంధ్ర ప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు ఎంతోమంది నాయకులు, ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆ సన్నివేశాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయడానికి సత్యా రెడ్డి గారు ఓ సినిమా రూపంలో చిత్రీకరించడం జరిగింది. అప్పుడు వైజాగ్ లో జరిగిన సన్నివేశాలు, దానికి ఉద్యమకారులు ఎటువంటి సపోర్టు చేశారు? మల్టీ నేషనల్ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? దీనిలోకి గద్దర్ ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? చివరికి ఎవరి ప్రయత్నం ఫలించింది? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని విడుదలపై చూడాల్సిందే.

Satya Reddy Starrer Ukku Satyagraham
Satya Reddy Starrer Ukku Satyagraham

నటీనటుల పనితీరు:

ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర సత్య రెడ్డి. ఆయన నటన చూస్తే దాసరి నారాయణరావు గారు గుర్తొస్తారు. ఓ ఉద్యమకారుడిగా చిత్రంలో అంత బాగా నటించారు. అటు ఎక్స్ప్రెషన్లలో కానీ అలాగే డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడ తడబడకుండా ఆయన నటించడం జరిగింది. అలాగే చిత్రానికి ప్రజానౌక గద్దర్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచారు. కొన్ని సన్నివేశాలలో సత్య రెడ్డితో కలిసి నటిస్తూ, అలాగే కొన్ని ఉద్యమ సన్నివేశాలలో పాల్గొంటూ చిత్రానికి వెన్నుముకగా నిలవడం జరిగింది. పల్సర్ ఝాన్సీ ఓ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఉద్యమకారునిగా తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ తన పాత్ర మేరకు మంచి స్క్రీన్ తో ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా చిత్రంలో తదితర పాత్రలు పోషించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారు.

Satya Reddy Starrer Ukku Satyagraham
Satya Reddy Starrer Ukku Satyagraham

గద్దర్ పాత్ర:

చిత్రంలో గద్దర్ పాత్ర తక్కువగానే ఉన్నప్పటికీ చిత్రానికి ఎంతో ప్లస్ గా నిలిచింది. గద్దర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చిన సన్నివేశాలు చాలా ఇంపాక్ట్ చూపించాలి. అదేవిధంగా గద్దర్ కొన్ని పాటలు రాసి తన పదాన్ని అందించడం జరిగింది. ఆ పాటలు విప్లవాత్మకంగా సినిమాకు బోనస్ గా నిలిచాయి. ఆయన కొన్ని పాటలలో కనిపిస్తూ ప్రేక్షకులను మరింత ఉత్తేజపరిచారు.

Satya Reddy Starrer Ukku Satyagraham
Satya Reddy Starrer Ukku Satyagraham

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమా కొన్ని యదార్థ సంఘటనలు తీసుకుని ఒక కథగా చేసుకుని చిత్రీకరించడం జరిగింది. దర్శకత్వం అలాగే స్క్రీన్ ప్లే బాగున్నాయి. లొకేషన్లు చాలావరకు విశాఖపట్నంలో చాలా న్యాచురల్ లొకేషన్స్లో చేయడంవల్ల సినిమాకు ఒక ఒరిజినాలిటీ కనిపించింది. అంతేకాక ఈ సినిమాలో డైలాగులు విప్లవత్మకంగా ఉండటం మరింత ప్లస్గా నిలిచాయి. డబ్బింగ్ అలాగే కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండ అనిపించింది. కెమెరా అక్కడక్కడ స్థిరంగా లేనట్లు అనిపించినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్లు నిజంగా విప్లవాలు జరుగుతున్నప్పుడు ఎలా అయితే మోసంతో ఉంటాయో ఈ చిత్ర సన్నివేశాలు కూడా అలాగే చాలా న్యాచురల్ గా అనిపించాయి.

Satya Reddy Starrer Ukku Satyagraham
Satya Reddy Starrer Ukku Satyagraham

ప్లస్ పాయింట్స్:

కథ

దర్శకత్వం

లొకేషన్స్

గద్దర్ స్క్రీన్ ప్రెజెన్స్

మైనస్ పాయింట్స్:

డబ్బింగ్

కెమెరా టేకింగ్

Satya Reddy Starrer Ukku Satyagraham
Satya Reddy Starrer Ukku Satyagraham

చివరగా:

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో అక్కడ జరిగిన విప్లవాలను కంటికి కట్టినట్లు యదార్థంగా చూపిస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గద్దర్ గారి విప్లవాత్మక స్ఫూర్తి చూడాలంటే కచ్చితంగా ఈ చిత్రం చూసి తీరాల్సిందే.

రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here