‘రోటి క‌ప్‌డా రొమాన్స్’ మూవీ రివ్యూ

0
47
Roti Kapda Romance Movie Review Rating
Roti Kapda Romance Movie Review Rating
చిత్రం: రోటి క‌ప్‌డా రొమాన్స్
రిలీజ్ డేట్: 28-11-2024
నటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి

సినిమాటోగ్రఫీ: సంతోష్ రెడ్డి

సంగీతం: సన్ని ఎం.ఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్

నిర్మాత : బెక్కం వేణు గోపాల్,  స్రుజన్ కుమార్ బొజ్జం

రచయత, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి

యూత్‌ఫుల్ ల‌వ్ డ్రామాగా రూపొంది ‘రోటి క‌ప్‌డా రొమాన్స్’ గురువారం (నవంబర్  28) థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో హ‌ర్ష‌, సందీప్ స‌రోజ్‌, సుప్ర‌జ్ రంగా, త‌రుణ్‌, నువేక్ష‌, మేఘ‌లేఖ హీరోహీరోయిన్లుగా న‌టించారు. విక్ర‌మ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హంచాడు. బెక్కెం వేణుగోపాల్‌, సృజ‌న్ కుమార్ నిర్మించారు. యూత్‌ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

కథ:

విక్కీ (సుప్రజ్ రంగా), హర్ష (హర్ష నర్రా), రాహుల్ (సందీప్ సరోజ్), సూర్య (తరుణ్ పొనుగోటి) నలుగురు స్నేహితులు. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ల జీవితాల్లోకి సోనియా (ఖుష్బూ చౌదరి), శ్వేతా (మేఘా లేఖా), దివ్య (నువేక్ష), ప్రియా (సోనూ ఠాకూర్) వస్తారు. సోనియా-హర్ష, ప్రియ-రాహుల్, శ్వేత- విక్కీ, దివ్య- సూర్య.. ఈ నాలుగు జంటలు ప్రేమలో పడతారు. ఆ తర్వాత వచ్చే కన్ఫ్యూజన్స్, మిస్ అండర్‌స్టాండింగ్స్, వన్ సైడ్ డిసిషన్స్ వల్ల ఈ నాలుగు జంటలు బ్రేకప్ చెప్పేసుకుంటారు. అలా విడిపోయిన ఈ నాలుగు జంటలు లైఫ్‌లో ఏవిధంగా రియలైజ్ అయ్యారనేదే క్లుప్తంగా ‘రోటి కపడా రొమాన్స్’ కథ.

నటీనటుల పనితీరు:

న‌లుగురు కుర్రాళ్లుగా సందీప్ స‌రోజ్‌, హ‌ర్ష న‌ర్రా, త‌రుణ్, సుప్ర‌జ్ రంగా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టాడు. వీరిలో విక్కీ పాత్ర చేసిన సుప్ర‌జ్ రంగా ఎక్కువ‌గా గుర్తుండిపోతాడు. మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా నువేక్ష బోల్డ్ రోల్‌లో క‌నిపించింది. నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర‌లో మేఘ‌లేఖ న‌ట‌న బాగుంది. ఖుష్బూ చౌద‌రి, సోనియా ఠాకూర్ కూడా ఓకే అనిపిస్తారు. ఈ పాత్రలన్నీ కథతో పాటు జర్నీ చేసే పాత్రలే. ఆ పాత్రల్లో వాళ్లు ఇమిడిపోయారు. తెరపై కనిపించిన పాత్రలే మనకి గుర్తొస్తాయి. 

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకి నటీనటుల ఎంపిక, కథ, కథనం డైరెక్షన్‌తో పాటు.. కథలోని మూడ్‌ను క్యారీ చేయడంలో సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా పాటలు కథలో భాగంగానే వస్తుంటాయి. పాటల్లో కూడా కథ కంటిన్యూ అవుతుండటం పాజిటివ్ అంశం. లవ్, ఎమోషన్స్, రొమాన్స్ సీన్స్ ను బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ చేశారు. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ త్రయానికి మ్యూజిక్ పరంగా మంచి మార్కులు పడతాయి. సంతోష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది.

విశ్లేషణ:

‘రోటి కపడా రొమాన్స్’‌తో పాత కథనే కొత్త కోణంలో యూత్‌కి కనెక్ట్ చేశారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. కథను ప్రారంభించిన తీరు.. ముందుకు తీసుకుని వెళ్లిన విధానంతో దర్శకుడు తన టాలెంట్ చూపించారు. ఎక్కడా బోరింగ్ లేకుండా కథని ముందుకు తీసుకుని వెళ్లారు. నాలుగు ప్రేమకథలు అంటే.. కథలో కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ.. ఎక్కడా అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీతో కథను నడిపించారు.

ఫస్టాఫ్‌లో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే అది కథలో బ్లెండ్ అయ్యేలా, అవసరం అనిపించేలా ఉండడంతో ఎబ్బెట్టుగా అనిపించదు .ఆ రొమాన్స్ కథకి అవసరం. యూత్‌కి ఇది ఒక సందేశంగానూ అనిపించొచ్చు. ‘రోటి కపడా రొమాన్స్’లో ఉన్న ఎమోషనల్ డెప్త్ యువత కనెక్ట్ అయిపోతుంది. నాది కూడా సేమ్ ప్రాబ్లమ్ అని కనిపించే నాలుగు కథల్లో ఏదో ఒక కథకి కనెక్ట్ అయిపోతారు. కనిపించే ప్రతి పాత్రని ఓన్ చేసుకుంటాం.

యూత్‌కు సీరియ‌స్‌గా క్లాస్ పీకుతున్న‌ట్లుగా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ హాయిగా న‌వ్విస్తూ సినిమా సాగుతుంది. చివ‌ర‌లో చిన్న షుగ‌ర్ కోటెడ్‌లో మెసేజ్‌ను ట‌చ్ చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’‌ యూత్‌కి ఫుల్ కిక్ ఇచ్చే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. 

రేటింగ్: 3.25 / 5

చివరగా: అలరించే యూత్ ఫుల్ ఎంటర్టైనర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here