ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో “ఇట్స్ ఓకె గురు”

0
36
It's Okay Guru First Look Poster
It's Okay Guru First Look Poster

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో “ఇట్స్ ఓకె గురు”

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్

చరణ్ సాయి – ఉషశ్రీ జంటగా… సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో తెరకెక్కిన విభిన్న కథాచిత్రం “ఇట్స్ ఓకె గురు”. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు – బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పనులు ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది!!

యూనీక్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్… ప్రముఖ నిర్మాత – నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్ విడుదల చేసి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్స్, కొన్ని విజువల్స్ చూశాక.. ఇట్స్ ఓకె గురు” చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనిపిస్తోందని అన్నారు!!

ఉత్తమాభిరుచి గల నిర్మాత అయిన దామోదర్ ప్రసాద్ గారు ఇచ్చిన కితాబు… తమ చిత్రంపై తమకు గల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత సురేష్ అనపురపు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో చరణ్ సాయి, హీరోయిన్ ఉష శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్, నిర్మాత సురేష్ సురేష్ అనపురాపు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ పాల్గొన్నారు!!

ఉమా మహేశ్వరరావు, బాల లత, విక్రమ్ మహదేవ్, సూరజ్ కృష్ణ, టింకు సాయినాధ్, దివ్య దీపిక బెల్లంకొండ, తేజ్ దీప్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రెస్ రిలేషన్స్: ధీరజ్-అప్పాజీ, డి.ఓ.పి – ఎడిటింగ్ – డి.ఐ: సన్నీ డి, ఆర్.ఆర్: ఎ. జె.ప్రియన్, మ్యూజిక్: మోహిత్ రెహమానియాక్, నిర్మాతలు: సురేష్ అనపురపు – బస్వా గోవర్ధన్ గౌడ్, దర్శకత్వం: మణికంఠ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here