“ఈసారైనా?!” సినిమా రివ్యూ

0
148

చిత్రం: ఈసారైనా?!

విడుదల తేదీ: నవంబర్ 8, 2024

నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ తదితరులు

సంగీతం: తేజ్

డీఓపీ: గిరి

ఎడిటింగ్: విప్లవ్

ఆర్ట్: దండు సందీప్ కుమార్

నిర్మాత: విప్లవ్

రచన- దర్శకత్వం: విప్లవ్

కథ:

ఇది ఓ పల్లెటూరి కథ. డిగ్రీ పూర్తి చేసుకుని నాలుగేళ్లవుతున్నా ఉద్యోగం లేక గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం చూస్తూ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడుతూ ఉంటాడు రాజు (విప్లవ్). అదే ఊరిలో శిరీష (అశ్విని) గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా జాబ్ కొట్టాలని రాజు స్నేహితుడు(మహబూబ్ పాషా), అశ్విని అతన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాక అశ్విని తండ్రి నీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. ఈ క్రమంలో రాజు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా? లేదా? శిరీషతో రాజు పెళ్లి అయిందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘ఈసారైనా!?’ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

నటీనటుల విషయానికి వస్తే హీరో విప్లవ్ కి ఇది మొదటి సినిమ. అయినా పల్లెటూరిలో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న కుర్రాడిలా కరెక్ట్ సెట్ అయ్యాడు. నటన విషయంలో కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక హీరోయిన్ అశ్విని స్క్రీన్ ప్రజన్స్, యాక్టింగ్ రెండూ బాగున్నాయి. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి నటన కూడా ఆకట్టుకుంది. ఒకపక్క నవ్విస్తూనే సీరియస్ తండ్రి పాత్రలో ఇమిడిపోయాడు. స్నేహితుడిగా మహబూబ్ పాషా నటన అలరిస్తుంది. సత్తన్న, అశోక్ మూలవిరాట్ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే విప్లవ్ హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఎడిటర్ గా అన్ని తానయి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. గిరి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో అసెట్ గా నిలిచింది. అలాగే తేజ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

విశ్లేషణ:

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నించే ఒక యువకుడి కథ ఇది. జీవితంలో సెటిల్ కాకుండానే ప్రేమలో పడి ఇబ్బందులు పడే యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి హీరో అల్లరి చిల్లరగా తిరగకుండా కష్టపడి చదవాలని ప్రయత్నించిన ప్రభుత్వ నోటిఫికేషన్ల కారణంగా తనకు ఉద్యోగం రాదు, ఒకపక్క ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఫస్ట్ ఆఫ్ పూర్తవుతుంది. తర్వాత హీరోయిన్ ని చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు చివరికి ఎలా చేరుకున్నాడు లాంటి విషయాలను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా, ఒక క్లీన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ గా సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో టీం అభినందించవచ్చు.

రేటింగ్:  2.75 / 5
చివరగా : ‘ఈసారైనా ‘ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక ఎమోషనల్ లవ్ డ్రామా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here