విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ #VenkyAnil3 టైటిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, క్యూరియాసిటీని జనరేట్ చేసిన ఫస్ట్ లుక్, సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అద్భుతమైన హ్యాట్రిక్ కొలాబరేషన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ #VenkyAnil3 చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే రెండు పెద్ద హిట్‌లను అందించింది. బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో అనిల్ రావిపూడి ది స్పెషల్ రికార్డ్. అప్ కమింగ్ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వడంతో పాటు, యూనిక్ ట్రైయాంగిలర్ క్రైమ్ నెరేటివ్ ని అందిస్తుంది.
ఈరోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సంక్రాంతి రిలీజ్ కి పర్ఫెక్ట్ మూవీ అనిపించింది. టైటిల్ డిజైన్ లో రంగోలి, తుపాకీ ఎలిమెంట్స్ ఫెస్టివల్, సినిమా క్రైమ్ థీమ్‌లను సూచిస్తుంది. టైటిల్ ఫాంట్ ఎట్రాక్టివ్ గా వుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, వెంకటేష్ లుంగీ ధరించి, స్పోర్టింగ్ షేడ్స్, తుపాకీ పట్టుకుని సీరియస్ పోజ్ లో కనిపించారు. అతని ఆన్-స్క్రీన్ భార్య ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయ లుక్‌లో, ఎక్స్ లవర్ మీనాక్షి చౌదరి మోడరన్ అవతార్‌లో ఉన్నారు. వెంకటేష్ లుక్ సాంప్రదాయ, స్టైలిష్ ఎలిమెంట్స్ తోకట్టిపడేసింది, పోస్టర్ లో వెంకటేష్ చరిష్మా అదిరిపోయింది.
బ్యాక్‌గ్రౌండ్‌లో క్లూస్, ముఖ్యమైన తేదీలు,వార్తాపత్రికల క్లిప్పింగ్‌లతో నిండిన ఇన్వెస్టగేటివ్ క్రైమ్ బోర్డు ఉంది, ఇది మూవీ ఆసక్తికరమైన కథాంశాన్ని సూచిస్తుంది. మొత్తంమీద, ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. పోస్టర్ డిజైన్‌లో అనిల్ రావిపూడి మార్క్ ఆకట్టుకుంది.
ఇప్పటికే డబ్బింగ్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా,చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
మార్కెటింగ్: నాని