“పొట్టేల్” మూవీ రివ్యూ

0
640
Pottel Movie Review
Pottel Movie Review

పొట్టేల్ మూవీ రివ్యూ

పొట్టేల్ కథ

1980లలో ఈ కథ మొదలైంది. మహారాష్ట్రలోని విదర్భకు 30 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న గుర్రం గట్టు అనే ఏజెన్సీలో గ్రామ దేవతగా బాలమ్మ ఉంటుంది. తరతరాలుగా బాలమ్మకు పూజ చేసే బాధ్యతను పటేల్(అజయ్) కుటుంబం తీసుకుంటుంది. అజయ్ కు తమ కులం వారు తప్ప వేరే కులం వారు చదువుకోవడం సుతరము ఇష్టముండదు. అయితే ఆ ఊరి బాలమ్మ పొట్టేలు మేపే పెద్ద గంగాధర్ యువచంద్ర ఈ విషయంలో ప్రతిసారి పటేల్ను ఎదిరించే ప్రయత్నం చేసి దెబ్బలు తింటూ ఉంటాడు. ఊరి వారందరూ అతన్ని పిచ్చోడిగా ముద్ర వేస్తారు. అనుకోని సందర్భంలో అదే ఊరికి చెందిన బుజ్జమ్మ(అనన్య)తో ప్రేమలో పడిన గంగాధర్ ఆమెను వివాహం చేసుకుంటాడు. చదువు విలువ తెలిసిన గంగాధర్ తాను చదువుకోలేకపోయాను కాబట్టి తన కుమార్తె సరస్వతి(తన్వి శ్రీ)ని చదివించాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. మరి ఈ క్రమంలో పటేల్ ఆగడాలను గంగాధర్ చెక్ పెట్టగలిగాడా? తన కుమార్తె సరస్వతిని చదివించగలిగాడా? ఊరి వారందరూ పటేల్ వెనుక నిలబడ్డారా? లేక గంగాధర్ వెనక నిలబడ్డారా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే

ఈ సినిమాలో అజయ్ పాత్ర గురించి ముందు నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నారు. అజయ్ పాత్ర బాగా పేలిందని ఇన్సైడ్ టాక్. సినిమా చూసిన తర్వాత కూడా ఆ టాక్ లో ఎలాంటి అబద్ధం లేదని అనిపించింది. ఎందుకంటే అజయ్ కు అలాంటి ఒక పాత్ర దక్కింది. పటేల్ అనే పాత్రలో అజయ్ నటించలేదు, జీవించేసాడు. ఒకరకంగా ఈ పాత్రలో అజయ్ తప్ప ఇంకెవరూ నటించలేరేమో అన్నట్టుగా ఒదిగిపోయాడు. ఇక హీరోగా నటించిన యువచంద్ర ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకంటే మిగతా వాళ్లతో పోలిస్తే ఆయనకు నటుడిగా పెద్ద గుర్తింపు ఇప్పటివరకు లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన నటుడిగా రెచ్చిపోయాడు. ఆయన నటన గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక అనన్య నాగళ్లకు కూడా ఒక మంచి పాత్ర పడింది ఈ బుజ్జమ్మ అనే పాత్రలో ఆమె తప్ప ఇంకెవరూ నటించలేరేమో అన్నట్టుగా ఆమె నటించింది.ఇక చిన్నారి పాత్రలో నటించిన తన్వి పాప కూడా చాలా న్యాచురల్ గా నటించింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనిపించింది. శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, నోయల్, చత్రపతి శేఖర్ మిగతా గ్రామస్తుల పాత్రధారులు, రింగ్ రియాజ్ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి శేఖర్ చంద్ర అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం చాలా పెద్ద ప్లస్ పాయింట్. పాటలు కొన్ని ఇప్పటికే హిట్ అయ్యాయి. మిగతావి తెరమీద చూస్తున్నప్పుడు భలే ఉన్నాయి అనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా ఫీల్ ని క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. ఇక సినిమాటోగ్రాఫర్ పనితనం సినిమా ఆద్యంతం కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం సినిమాటోగ్రాఫర్ నిలబెట్టేసాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ పనితనం కూడా ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. నిర్మాణ విలువలు అత్యద్భుతం అని చెప్పాలి. ఎక్కడా చిన్న సినిమా అనే ఫీలింగ్ రాలేదు.

విశ్లేషణ

సవారి అనే సినిమాతో దర్శకుడిగా మారిన సాహిత్ ఈ పొట్టేలు సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. దానికి ముఖ్య కారణం టైటిల్ కాగా ఆ తర్వాత నెమ్మదిగా సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా మీద ఆసక్తి మరింత పెంచేలా సాగింది. ఇక సాహిత్ ఈ సినిమా కోసం తీసుకున్న బ్యాక్ డ్రాప్ తో పాటు రాసుకున్న పాత్రలు చెప్పాలనుకున్న పాయింట్ అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి. కానీ ఎక్కడో ఎగ్జిక్యూషన్లో కాస్త తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకరకంగా రచయితగా వంద మార్కులు వేయించుకున్న సాహిత్ దర్శకుడిగా మాత్రం 100 వేయించుకోలేకపోయాడు ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఎంజేజ్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అయితే చదువు విలువ తెలిసిన వారికి మాత్రం ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే హీరో చదువు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడే సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఒకపక్క మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూనే మరొకపక్క దైవ శక్తి కూడా ఉందని చెబుతూ సాగిన ఈ పాయింట్ ఎంగేజింగ్ గా సాగింది. నిజానికి ఇలాంటి ఒక కథ చెప్పడం అంటే కత్తి మీద సాము లాంటి విషయమే. ఎలాంటి పొరపాటు జరిగిన మనోభావాలు దెబ్బతిని ఎంతోమంది రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుంది. కానీ సాహిత్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. చదువే దేవుడు ఆ చదువు చెప్పే మీరు దేవుడు కన్నా ఎక్కువే అని చెప్పే డైలాగ్ సినిమా మొత్తం మీద వ్యక్తిగతంగా నా ఫేవరెట్. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. చదువు విలువ చెప్పేలా మూఢనమ్మకాలను పారద్రోలేలా ఊరి మొత్తాన్ని ఎదిరించే యువచంద్రను ఓన్ చేసుకునే వాళ్ళు ఈ సినిమాకి మరింత కనెక్ట్ అయిపోతారు.

తుది తీర్పు

ఈ పొట్టేల్ ఒక రా అండ్ రస్టిక్ డ్రామా.. విత్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్

రేటింగ్ 

3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here