రేపు హీరో కిరణ్ అబ్బవరం “క” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

0
38
"KA" Trailer From Tomorrow
రేపు హీరో కిరణ్ అబ్బవరం “క” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“క” సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం 5.01 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. “క” ట్రైలర్ పై మూవీ లవర్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులుకిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

Kiran Abbavaram "KA" Trailer From Tomorrow
Kiran Abbavaram “KA” Trailer From Tomorrow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here