మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నోరా ఫతేహి, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ నుంచి మెమరబుల్ రెట్రో సాంగ్ లే లే రాజా రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్ కు రెడీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి.
మేకర్స్ ఫస్ట్ సింగిల్ లే లే రాజా విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ మెమరబుల్ రెట్రో పాటను స్కోర్ చేసారు. 70, 80ల స్టైల్‌లోని కంపోజిషన్ థంపింగ్ బీట్‌లతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం రెట్రో అనుభూతిని కలిగిస్తుంది, నీతి మోహన్ వోకల్స్ కట్టిపడేశాయి.
ఈ పాటలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. కలర్‌ఫుల్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన పాటలో నోరా ఫతేహి రెట్రో లుక్‌లో అలరించింది. ఎక్స్ ట్రార్డినరీ డ్యాన్స్ మూవ్స్ తో సోఫియాగా గ్లామర్ క్వీన్‌లా కనిపించి మెస్మరైజ్ చేసింది. జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ వింటేజ్ వైబ్స్ ని తీసుకొచ్చింది. ఇది మ్యూజికల్ ప్రమోషన్‌లకు పర్ఫెక్ట్ స్టార్ట్, నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కోసం స్టేజ్ ని సెట్ చేసింది.
టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ ట్రైలర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించనుంది.
నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా