ఉలగనాయగన్ కమల్ హాసన్ లాంచ్ చేసిన ‘లెవెన్’ ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్

0
50
Eleven Movie - The Devil is Waiting Lyrical Video Out Now
Eleven Movie - The Devil is Waiting Lyrical Video Out Now

ఉలగనాయగన్ కమల్ హాసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర, లోకేశ్ అజ్ల్స్, ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు తమిళ్ బైలింగ్వల్ ‘లెవెన్’ కోసం శ్రుతిహాసన్‌ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా కోసం మల్టీ ట్యాలెంటెడ్ శ్రుతిహాసన్‌ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఈ సాంగ్ ని లాంచ్ చేసి మూవీ టీంకి బెస్ట్ విషెస్ అందించారు.

కంపోజర్ డి.ఇమ్మాన్ ఈ సాంగ్ ని ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ తో టెర్రిఫిక్ నెంబర్ గా ట్యూన్ చేశారు. లోకేశ్ అజ్ల్స్ రాసిన లిరిక్స్ స్టొరీ, హీరో క్యారెక్టర్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేశాయి. శ్రుతిహాసన్‌ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఆమె వాయిస్ లిజనర్స్ ని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా, మ్యూజిక్ చార్ట్స్ లో ట్రెండ్ అవుతోంది.  

‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.

త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం – లోకేశ్ అజ్ల్స్
బ్యానర్ – AR ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత – అజ్మల్ ఖాన్ & రేయా హరి
సంగీతం – డి.ఇమ్మాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ప్రభు సాలమన్
సహ నిర్మాత – గోపాలకృష్ణ.ఎం
డీవోపీ – కార్తీక్ అశోక్
ఎడిటర్ – శ్రీకాంత్.ఎన్.బి
ఆర్ట్ డైరెక్టర్ – పి.ఎల్. సుబెంథర్
యాక్షన్ డైరెక్టర్ – ఫీనిక్స్ ప్రభు
పీఆర్వో- వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here