లెజెండరీ యాక్టర్ ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా “ధూం ధాం” సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్, అక్టోబర్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

0
46
Dhoom Dhaam team special tribute to Legend Akkineni Nageswara Rao Garu on his centenary
Dhoom Dhaam team special tribute to Legend Akkineni Nageswara Rao Garu on his centenary

లెజెండరీ యాక్టర్ ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా “ధూం ధాం” సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్, అక్టోబర్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనకు ట్రిబ్యూట్ గా “ధూం ధాం” సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ లోని మనసు గతి ఇంతే పాటను వెన్నెల కిషోర్ పాడుతున్న వీడియో ఆకట్టుకుంటోంది.

“ధూం ధాం” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గోపీసుందర్ స్వరపర్చిన పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ పాజిటివ్ వైబ్స్ తో “ధూం ధాం” సినిమాను హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులుచేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here