సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు అనే ఫార్ములా కాదంటూ కొత్తతరం దర్శకులు నిరూపిస్తున్నారు. ఒక కథనే కాకుండా వివిధ కథలను తీసుకుని వాటిని మిళితం చేసి ఆంథాలాజీ పేరుతో వైవిధ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ సక్సెస్ అవుతున్నారు. ‘#లైఫ్ స్టోరీస్’తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉజ్వల్ కశ్యప్ కూడా ఈ కోవకు చెందినవాడేనని సగర్వంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు నాలుగైదు కథలతోనే ఆంథాలజీని తీసుకొచ్చిన దర్శకులుండగా.. ఉజ్వల్ కశ్యప్ ఏకంగా ఆరు కథలతో ఎన్నో జీవితాలను వెండితెరపై ప్రేక్షకుల కళ్లముందు ఉంచాడు. అసలు ఈ ‘#లైఫ్ స్టోరీస్’ సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే ముందుగా కథలో వెళ్దాం..
కథ:
ఈ కథ ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీసులో మొదలవుతుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుండగా.. అతడి ప్రయాణంలో తారసపడే మిగతా ఐదు కథల ఆధారంగా ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఆఫీసులో పని చేసే భార్య తన భర్తతో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకునేందుకు కూడా కుదరకపోవడం, ఇక ఒంటరి మహిళ అయిన మంగమ్మకు శునకం ఏ విధంగా తోడు నిలిచింది? అలాగే ఇద్దరు పాత స్నేహితులు కలుసుకుంటే వాళ్ల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? స్కూలుకు వెళ్లే పిల్లాడికి తన తల్లి దగ్గర లేకుండా ఉంటే అతడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? స్నేహం, ఆనందం, సహవాసం, ఒంటరితనం, ఆనందం, కల్తీ లేని ప్రేమ లాంటి విభన్నమైన అంశాలను ఈ కథలో చూపించాడు దర్శకుడు.
విశ్లేషణ:
సింపుల్ స్టోరీస్‌తో మన రోజువారీ జీవితంలో ఫేస్ చేసే కథనాల్ని బట్టి తీసిన సినిమా ‘#లైఫ్ స్టోరీస్’. ఆరు కథలను ఉద్దేశించి ఒకదానికి ఒకటి ఎలా సింక్ చేశారో అన్నదే ‘#లైఫ్ స్టోరీస్’ ఒక బెంట్ ఆఫ్ మైండ్ సాంగ్‌తో మొదలయ్యి సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుండగా క్యాబ్ డ్రైవర్ సాఫ్ట్ వేర్ జాబ్ నుండి క్యాబ్ డ్రైవర్‌గా మారి ఎంత సంతోషంగా ఉన్నాడో అనేది మొదటి కథ అయితే.. రెండో కథలో సాఫ్ట్‌వేరే ఉద్యోగం చేసే భార్య.. తన భర్తతో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోలేక ఏం చేసింది అనేది చూపించారు. మూడో కథలో మంగమ్మ అనే వృద్ధురాలికి ఒక పెంపుడు కుక్క దొరకడంతో ఆమె జీవితం ఎలా మారిపోయింది అనేది చక్కగా చూపించారు. నాలుగో కథలో నలభై ఏళ్లు పైబడిన దంపతులు సెకండ్ హనీమూన్‌కి వెళ్తారు. అక్కడ ఏం జరిగిందనేది చూపించారు. ఇక ఐదో కథకి వస్తే ఒక సింగల్ పేరెంట్ అయిన అమ్మ (దేవయాని శర్మ ) తన కొడుకుని వదిలి జాబ్‌లో బిజీ అయిపోతుంది. పని మనిషి ఆ బాబుని రెడీ చేసి స్కూల్‌కి పంపించి అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. బాబు నిద్ర లేచే సరికి అమ్మ కనిపించకపోతే ఎలా కంగారు పడతారో, అమ్మను ఎంత మిస్ అవుతారో ప్రతి తల్లితండ్రులకి తెలిసేలా కళ్ళకు కట్టినట్టు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చూపించారు డైరెక్టర్. ఇకచివరి కథ విషయానికి వస్తే పీయూష్(సత్య ) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్. ప్రియురాలితో గొడవ పడి న్యూ ఇయర్ పార్టీని సింగిల్‌గా సెలెబ్రేట్ చేసుకోవడం కోసం వికారాబాద్ వెళ్తూ ఉంటాడు. అస్సలైన కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకదానికి ఒకటి ఇంటెర్లింక్‌గా ఎలా కనెక్ట్ చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇది ఆరు కథల సినిమా అనేకంటే ఎంతోమంది జీవితాలను ప్రతిబింబించే ఒక జీవిత చిత్రంగా చెప్పొచ్చు. ఇందులో కేవలం ఆరు కథలే కాదు.. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. వాళ్ల స్వభావం ఏంటనేది తెలిసేలా దర్శకుడు ఎంతో చక్కగా కథను రాసుకున్నాడు. నిజ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఎన్నో అవార్డులు రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. ఇలాంటి కథపై జర్నీ చేసి.. ఎంతో మంది జర్నీలను చూపించిన దర్శకుడు ఉజ్వల్ కశ్యప్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాలో మైనస్ అంటే ఒక ప్యాడింగ్ అనే చెప్పాలి. కాస్టింగ్ ఇంకా బాగుంటే ఈ సినిమా రీచ్ ఇంకా పెరిగేదని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించడం గమనార్హం.
నటీనటుల పనితీరు:
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా మంగమ్మ పాత్ర పోషించిన వృద్ధురాలు ఎంతో సహజంగా నటించారు. ఇక సింగిల్ మదర్ క్యారెక్టర్ చేసిన దేవియాని శర్మ కూడా తన నటనతో పర్వాలేదనిపించింది. ప్రైవేట్ బస్సు కండక్టర్‌గా కనిపించిన శుభోదయం సుబ్బారావు అలియాస్ రాజశేఖర్ పాత్ర కూడా చాలా బాగుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్ పీయూష్ పాత్రలో సత్య కూడా అదరగొట్టాడు. సతీష్, మంగేష్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లు హాస్యం పండించారు. చిన్న పిల్లాడి నుంచి అందరూ బాగా నటించారు. ఇక సంగీతం చాలా చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫర్ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించారు.
ఆలోచింపజేసేలా ‘#లైఫ్ స్టోరీస్’
6 కథలను అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ఉజ్వల్
చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు చూడాల్సిన సినిమా
రేటింగ్: 3.25/5