రాజ్ తరుణ్ “భలే ఉన్నాడే” సినిమా రివ్యూ
కథ
విశాఖపట్నంలో గౌరీ (అభిరామి) ఒక సింగిల్ మదర్, బ్యాంకులో పని చేస్తూ ఉంటుంది. ఆమె కొడుకు రాధ(రాజ్ తరుణ్) అందరికంటే భిన్నంగా పెళ్లిళ్లలో పెళ్లికూతురులకు చీర కట్టే వృత్తి ఎంచుకుంటాడు.. పని అమ్మాయిలతోనే అయినా కనీసం వాళ్లను ముట్టుకోకుండానే చీర కడుతూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాడు. మామూలుగానే అమ్మాయిలు అంటే దూరం మైంటైన్ చేసే రాధకు గౌరీ బ్యాంకులో కొత్తగా చేరిన కృష్ణ (మనీషా)తో ఒక రకమైన స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం ప్రేమకు దారి తీస్తుంది. అంతా ఓకే, పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో కృష్ణ స్నేహితురాలి(ఇందు) జీవితంలో జరిగిన ఒక సంఘటన అనేక మలుపులు తిరిగి చివరికి రాధా-కృష్ణ దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మగాడే కాదు తేడా అన్నట్టుగా రాధ ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటాడు? అమ్మాయిలంటే ఆమడ దూరం పరిగెత్తే రాదా కృష్ణతో ఎలా ప్రేమలో పడ్డాడు? చివరికి రాధా-కృష్ణ ఒకటయ్యారా? లేదా? చివరకు అసలు ఏమైంది అనేది కథ.
నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమాలో రాజ్ తరుణ్ గత సినిమాల కంటే భిన్నంగా ప్రేక్షకులందరూ తేడా అని భావించే విధమైన పాత్రలో కనిపించాడు. నిజానికి ఇలాంటి పాత్రను ఎంచుకోవడంతోనే రాజ్ తరుణ్ ఈ సినిమా విషయంలో మొదట సక్సెస్ అయ్యాడు అనిపించింది. ఎక్కడ వల్గారింటికి ప్రధాన నది ఇవ్వకుండా తనదైన శైలిలో నటించిన తీరు ప్రశంసనీయం. తనదైన ఎనర్జీ పక్కనపెట్టి సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్గా మనీషా కూడా సరిగ్గా సెట్ అయింది. ముఖ్యంగా రాధ పాత్రలో రాజ్ తరుణ్ కృష్ణ పాత్రలో మనీషా మధ్య కెమిస్ట్రీ కూడా ఆసక్తికరంగా ఉంది. అభిరామి రాజ్ తరుణ్ తల్లి పాత్రలో జీవించేసింది. ఒక మాటలో చెప్పాలంటే అమ్మ పాత్రే గాని హీరో పక్కన అక్కలా కనిపిస్తూ ఆకట్టుకుంది. నిజానికి సినిమా మొత్తం మీద ఆమెది బరువైన పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గోపరాజు రమణ, సింగీతం శ్రీనివాసరావు కనిపించింది కొద్ది సీన్స్ అయినా ఆకట్టుకున్నారు. హైపర్’ ఆది, సుదర్శన్, వీటీవీ గణేష్, కృష్ణ భగవాన్, పటాస్ ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, ‘రచ్చ’ రవితో పాటు కొందరు హాస్య నటులు నవ్వించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీం
విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడిగా శివ సాయి వర్ధన్ ఎమోషనల్ పార్ట్ మొత్తాన్ని అద్భుతంగా నడిపించాడు. అయితే కామెడీ విషయంలో కొంత క్రింజ్ అనిపించినా మిగతా అంతా ప్రేక్షకులను అలరిస్తూ ఆలోచింపచేసేలా సాగింది. ముఖ్యంగా ఎమోషనల్ డైలాగ్స్ లోతుగా అనిపిస్తాయి. ‘పెళ్లిలో కాంప్రమైజ్ ఉండొచ్చు కానీ.. పెళ్లే కాంప్రమైజ్ అనుకుంటే వద్దు’.. ‘ఈ కాలంలో రాముడు పుట్టినా చేతకానీ వాడే అనుకుంటారు.. అలా అని రాముడు దేవుడు కాకుండా
పోతాడా?’ ఇలా చాలా డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. స్క్రీన్ మీద చాలా అందంగా సినిమాను తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ పనితీరు కనిపించింది. ఎడిటింగ్ క్రిస్పీ గానే ఉంది.. ముఖ్యంగా పాత్రల ఎంపిక, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ
నిజానికి ఇది కొత్త కథ అని చెప్పలేం, ముందు ప్రేమించుకున్న జంట తర్వాత అపార్ధాల కారణంగా విడిపోయి చివరికి కలుసుకోవడం అనే ప్రధానమైన పాయింట్తో సినిమా తెరకెక్కించారు. కానీ మనిషిని చూసి కాదు ఆ మనిషితో ట్రావెల్ చేసి విషయం తెలుసుకోవాలని సినిమా చూశాక అనిపిస్తుంది. మగాడు అంటే ఆడదాన్ని ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి శారీరక సుఖం అందించేవాడు మాత్రమే కాదు ఆడదానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు అనే పాయింట్ సినిమా మొత్తాన్ని కొత్త యాంగిల్ లో చూపిస్తుంది. అసలు పెళ్లి చేసుకో కుండా అమ్మాయిని ముట్టుకోకూడదు అని హీరో పెట్టుకున్న నియమం ఈ తరం కుర్ర కారపు ఒకసారి కొత్త మెసేజ్ ఇస్తుంది. నిజానికి ఈరోజుల్లో మంచిగా ఉండేవారిని చేతగాని వారిగా చూసే పరిస్థితుల్లో ఎలాంటి కథతో ఒక సినిమా చేయాలనుకోవడమే ఒక సాహసం. నిజానికి ఈ సినిమా ద్వారా కొన్ని బలమైన పాయింట్‌స్ ని టచ్ చేశాడు దర్శకుడు. ప్రస్తుతం చాలా మంది మగాళ్లల్లో మ్యాటర్ ఉండటం లేదనే సున్నితమైన సబ్జెక్ట్ ని టచ్ చేయడం, వృత్తిని రియల్ లైఫ్‌కి ఆపాదించే సమాజం, మూడోది పెళ్లికి ముందే లవర్స్ సెక్స్ ను టెస్ట్ డ్రైవ్ లా చేయాలి అనే పాయింట్స్ చెబుతూ వాటి పర్యవసానాలు ఎంతటి దారుణంగా ఉంటాయో ఈ సినిమా ద్వారా డిస్కస్ చేశాడు దర్శకుడు. ఇక కథ అంతా ఎమోషనల్ వేలో నడిపించే ప్రయత్నం చేశారు అందులో దాదాపు సక్సెస్ అయ్యారు కూడా.
ఫైనల్లీ
భలే ఉన్నాడే.. ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్
రేటింగ్
3/5