రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్, సెల్వరాజ్, స్పిరిట్ మీడియా & వేఫేరర్ ఫిలింస్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ ‘కాంత’- ఈరోజు షూటింగ్ ప్రారంభం

0
54
Rana Daggubati - Dulquer Salmaan - Bhagyashri Borse - Kaantha - Opening Clap By Victory Venkatesh
Rana Daggubati - Dulquer Salmaan - Bhagyashri Borse - Kaantha - Opening Clap By Victory Venkatesh

రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్, సెల్వరాజ్, స్పిరిట్ మీడియా & వేఫేరర్ ఫిలింస్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ ‘కాంత’- ఈరోజు షూటింగ్ ప్రారంభం

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్‌ కొలాబరేషన్లో మోస్ట్ ఎవైటెడ్ మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ “కాంత” హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.

ఈ కొలాబరేషన్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరిరియన్స్ ని అందించదానికి రెండు క్రియేటివ్ పవర్‌హౌస్‌లను ఒకచోట చేర్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా భాగ్యశ్రీ నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు చిత్రీకరణ కూడా ప్రారంభమౌతోంది.

1950 మద్రాస్‌ బ్యాక్ డ్రాప్ లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ చైంజెస్ ని ఎక్స్ ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ఈ సినిమా వుండబోతోంది.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ..కాంత కోసం వేఫేరర్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ని యాడ్ చేసింది. క్యాలిటీ సినిమా పట్ల మా విజన్ ఒకేలా వుంటుంది. సురేశ్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీని పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ ‘కాంత”. అన్నారు

హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ” స్పిరిట్ మీడియాతో ‘కాంతా’తో ఈ జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ. ఒక నటుడికి పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తుంది. ఈ సినిమాకి ప్రాణం పోసినందుకు నేను థ్రిల్ అయ్యాను’ అన్నారు

డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ”ఇటువంటి ప్రతిభావంతులైన నిర్మాతలు, క్రియేటివ్ టీంతో  కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. కాంతతో, మేము ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పని చేస్తున్నాం’ అన్నారు

ప్రశాంత్ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ , జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ గా టాప్ లెవల్ లో వుండబోతోంది.  డాని శాంచెజ్ లోపెజ్  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాను సంగీతం సమకూరుస్తున్నారు. రామలింగం ఆర్ట్ డైరెక్టర్, రైటర్ తమిళ్ ప్రభ. లెవెల్లిన్ ఆంథోనీ గొన్సాల్వేస్ ఎడిటర్.

ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.

తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయికృష్ణ గద్వాల్
లైన్ ప్రొడ్యూసర్ – శ్రవణ్ పాలపర్తి
DOP – డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ – రామలింగం
రైటర్ – తమిళ్ ప్రభ
సంగీతం- జాను
ఎడిటర్ – లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్
పీఆర్వో: వంశీ-శేఖర్

‘Sarangapani Jathakam’ wraps up its shoot – Click To Read Here >>

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here