రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ సింహ కోడూరి, సత్య, రితేష్ రానా ‘మత్తు వదలరా 2’ హైలీ ఎంటర్ టైనింగ్ థియేట్రికల్ ట్రైలర్‌

0
62
Rebel Star Prabhas Launched Mathu Vadalara 2 Trailer
Rebel Star Prabhas Launched Mathu Vadalara 2 Trailer

రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ సింహ కోడూరి, సత్య, రితేష్ రానా ‘మత్తు వదలరా 2’ హైలీ ఎంటర్ టైనింగ్ థియేట్రికల్ ట్రైలర్‌

బ్లాక్‌బస్టర్ మత్తు వదలారకు సీక్వెల్ ‘మత్తు వదలరా 2’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.  శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌,  టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌  ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

హెచ్‌ఈ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న శ్రీ సింహ, సత్య, వారు పట్టుకున్న కిడ్నాపర్‌ల నుండి డబ్బును గుంజుతుంటారు. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ తో వారి జీవితం మలుపు తిరుగుతుంది. , స్పెషల్ టీం వారిని కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ గా నమ్మి వెంటపడుతుంది.

దర్శకుడు రితేష్ రానా సీక్వెల్ కోసం మరొక అద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకున్నాడు, ప్రతి పాత్ర కీ రోల్ ప్లే చేస్తుంది. నెరేటివ్ రేసీ అండ్  క్రేజీగా ఉంటుంది.  స్లేవ్ డ్రగ్ కాన్సెప్ట్ యూనిక్ టర్న్ ని యాడ్ చేస్తోంది. ముఖ్యంగా, టీవీ సీరియల్ ఎపిసోడ్‌లు హిలేరియస్ గా అలరించింది .

శ్రీ సింహ కోడూరి, సత్య పాత్రలు మోస్ట్ ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ ప్రజెన్స్ నెరేటివ్ కి అదనపు ఉత్సాహాన్ని, క్రేజీని తెస్తుంది. రోహిణి, ఝాన్సీ సీరియస్ రోల్స్ లో కనిపించారు.

సినిమాటోగ్రాఫర్ సురేశ్ సారంగం, సంగీత దర్శకుడు కాల భైరవ, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్ కలిసి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అందించారు. ఓవరాల్‌గా సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింతగా అంచనాలని పెంచింది.

తారాగణం: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్లు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) & హేమలత
సంగీతం: కాల భైరవ
డిఓపి: సురేష్ సారంగం
సహ రచయిత: తేజ ఆర్
Asst. రైటర్: సాయి సోమయాజులు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్‌చున్ అంజి
లిరిసిస్ట్: ఫరియా అబ్దుల్లా
Vfx సూపర్‌వైజర్: జూలూరి అనిల్ కుమార్
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: ARK WRX
స్టిల్స్: నిఖిల్ YHS
పబ్లిసిటీ డిజైన్స్: శ్యామ్ పాలపర్తి
మేకప్ చీఫ్: కొండా రమేష్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మామిడిపల్లి
పీఆర్వో: వంశీ – శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: తేజ ఆర్

Rebel Star Prabhas Launched Mathu Vadalara 2 Trailer
Rebel Star Prabhas Launched Mathu Vadalara 2 Trailer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here