ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

0
127
6 Journey Movie - Teaser Launch
6 Journey Movie - Teaser Launch

ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మైన ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో..

పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా బాగుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ‘మా అందరినీ ఆశీర్వదించేందుకు వచ్చిన రమేష్ రెడ్డి అన్నకి, వెంకట్ రెడ్డి అన్నకి, ప్రతాప్ రెడ్డి అన్నకి థాంక్స్. మాకోసం వచ్చిన మీడియా వారికి థాంక్స్. మా హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారు. రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ గారు మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి గారు మా అందరికీ టీచర్. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.

6 Journey Movie - Teaser Launch
6 Journey Movie – Teaser Launch
6 Journey Movie - Teaser Launch
6 Journey Movie – Teaser Launch

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here