‘The GOAT’ లో నన్ను నేను రిలేట్ చేసుకునే క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది: హీరోయిన్ మీనాక్షి చౌదరి

0
43
Meenakshi Chaudhary Interview - Thalapathy Vijay The Greatest Of All The Time
Meenakshi Chaudhary Interview - Thalapathy Vijay The Greatest Of All The Time

‘The GOAT’ లో నన్ను నేను రిలేట్ చేసుకునే క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది: హీరోయిన్ మీనాక్షి చౌదరి

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.  ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా  హీరోయిన్  మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

విజయ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-విజయ్ గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. విజయ్ గారు పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన లాస్ట్ సినిమా ఇది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అమెజింగ్ ఎక్స్ పీరియన్స్. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నాను.

ఈ ప్రాజెక్ట్ లో ఎలా వచ్చారు ?
-డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-నాది యంగ్ మోడరన్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్. వెరీ ఫన్ అండ్ లవింగ్ గా వుంటుంది. నా పర్శనల్ లైఫ్ లో కూడా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక లేయర్ వుంటుంది. కథలో నా క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది.సినిమా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది.  

మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. ఇప్పుడు విజయ్ గారి చేశారు. వారి మధ్య ఎలాంటి పోలికలు కనిపించాయి?
-ఈ ఇద్దరితో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇద్దరూ చాలా క్రమశిక్షణ గల హీరోస్. సెట్స్ లో అందరినీ సమానంగా గౌరవిస్తారు. వారితో వర్క్ చేయడం లైఫ్ టైం ఆపర్చ్యునిటీ.

గోట్ లో స్నేహ, లైలా లాంటి సినియర్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-స్నేహ, లైలా లాంటి సినియర్స్ తో వర్క్ చేయడం గ్రేట్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. కెరీర్ బినింగ్ లోనే ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా వుంది. అందరూ నన్ను చాలా కేర్ గా చూసుకున్నారు.

డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి గురించి?
-వెంకట్ ప్రభు గారు కూల్ పర్శన్. చిల్ గా వుంటారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ యూనిక్ గా వుంటుంది. చాలా సపోర్టివ్ గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వెనుక స్పెషల్ ప్లాన్ ఉందా ?
-స్పెషల్ ప్లాన్ అంటూ ఏమీ లేదండి. ఇందులో 2023లో సైన్ చేసిన సినిమాలు కూడా వున్నాయి. లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కి రావడం కోఇన్సిడెంట్. ఇలాంటి మంచి సినిమాలలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది.

మీ సినిమాల ఎంపిక ఎలా వుంటుంది ?
-స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి చూస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడతాను.

-మట్కా పిరియడ్ ఫిలిం, అందులో నాది వెరీ డిఫరెంట్ అవతార్. మొకానిక్ రాకీలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. లక్కీ భాస్కర్ లో మదర్ రోల్ ప్లే చేశా. అనిల్ రావిపూడి సినిమాలో కాప్ రోల్ చేస్తున్నాను. ఇవన్నీ దేనికవే స్పెషల్ గా వుంటాయి.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ.

Meenaskshi Chaudhary – Photos Greatest Of All Time Pre-Release Event

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here