వెడ్డింగ్ డైరీస్(రీ సెట్ అండ్ రీ స్టార్ట్) రివ్యూ

0
154
Wedding Diaries (Reset & Re-Start) Movie Review
Wedding Diaries (Reset & Re-Start) Movie Review

వెడ్డింగ్ డైరీస్(రీ సెట్ అండ్ రీ స్టార్ట్) రివ్యూ

వెడ్డింగ్ డైరీస్ కథ

ప్రశాంత్(అర్జున్ అంబటి) ఓ బిజీ ఫోటోగ్రాఫర్. అయితే మోడలింగ్ ఫోటోగ్రాఫర్ గా ఎదగాలన్న కలతో పని చేస్తూ ఉండగా తనకు పరిచయమైన శృతి(చాందినీ తమిళరసన్)తో ప్రేమలో పడతాడు. ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్. ప్రశాంత్ తో ఆమె కూడా ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. వీరికి ఓ పాప, బాబు పుట్టాక చాలా మంది లానే వీరి మధ్య కూడా మనస్పర్థలు వస్తాయి. ఇద్దరూ గొడవపడుతూ ఇక కరెక్ట్ కాదని ఒక దశలో విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అయితే అసలు వీరి గొడవలకు కారణం ఏమిటి? ఈ వెడ్డింగ్ డైరీస్ టైటిల్ ఏంటి? ప్రశాంత్ – శృతి విడాకులు తీసుకున్నారా? చివరికి ఏమైంది? అనేది కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్

నటీనటుల విషయానికి వస్తే ఇప్పటికే పలు సినిమాల్లో లీడ్ రోల్స్ చేసి సీరియల్స్ లో కూడా ఆకట్టుకున్న అర్జున్ అంబటి ప్రశాంత్ పాత్రలో జీవించాడు. అరెరే ఇది నేనేనా అని సగటు మగాడు, మొగుడు ఓన్ చేసుకునేలా నటించారు. ఇక హీరోయిన్ గా నటించిన చాందినీ తమిళరసన్ రోల్ చాలా క్లిష్టమైనా ఆమె నటనతో ఈ పాత్రకు సరిగ్గా సెట్ అయింది. అన్నట్టు కుర్రాళ్ళ కోసం గ్లామర్ కూడా ఒలకబోసింది. రవి శివ తేజ, చమ్మక్ చంద్ర, సీనియర్ నటి జయలలిత, సత్య శ్రీ, శ్రీవాణి త్రిపురనేని వంటి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

టెక్నికల్ టీం

ఈ సినిమాలో టెక్నికల్ టీం గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో మదీన్ ఎస్.కె మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఓ రకంగా సినిమాకి పాటలు అదనపు హంగులు తీసుకొచ్చాయి. కేవలం వినడానికే కాదు చూడటానికి కూడా ఆకట్టుకున్నాయి. పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లజంట్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఈశ్వర్ ఎళ్ళుమహంతి సినిమాటోగ్రఫీ సినిమాను మరింత అందంగా చూపించడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది అలాగే ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ 

ఈ వెడ్డింగ్ డైరీస్ సినిమా కథ కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రేమించి, పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు రావడం అనే పాయింట్ చాలా సినిమాల్లో చూశాం, చూస్తున్నాం, చూస్తూనే ఉంటాం. కానీ ‘వెడ్డింగ్ డైరీస్’ కే ‘రీసెట్ అండ్ రీ స్టార్ట్’ అనే క్యాప్షన్ పెట్టగా అదే ఆసక్తి రేకెత్తించే మొదటి ఎలిమెంట్ అయింది. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ… పెళ్ళైన కొన్నేళ్ళకి ఎందుకు తగ్గుతుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా చాలా జంటలు విడాకుల బాట ఎందుకు పడుతున్నాయి అనే విషయాన్ని సెన్సిబుల్ గా డీల్ చేయడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా గొడవలు పడడం పక్కనపెడితే అసలు విడిపోతే వచ్చే కష్టాలను అవసిష్కరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేమ. పెళ్లితో ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలిగినా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా అనిపించింది.

తీర్పు

‘వెడ్డింగ్ డైరీస్’ అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యే, హ్యాపీగా థియేటర్లో చూడదగ్గ సినిమా.

రేటింగ్ 

3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here