ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం

0
64
Kiran Abbavaram Weds Rahasya Gorak
Kiran Abbavaram Weds Rahasya Gorak
ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది. కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ వివాహ వేడుకల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్… ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ “క” లో నటిస్తున్నారు. ఈ త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Kiran Abbavaram Weds Rahasya Gorak
Kiran Abbavaram Weds Rahasya Gorak

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here