ఐయామ్ హ్యాండ్సమ్ మూవీ రివ్యూ
సినిమా: ఐ యామ్ హ్యాండ్సమ్
విడుదల తేదీ: 12 జూన్ 2026
CBFC రేటింగ్: UA
నిడివి: 2గం 14ని
నటీనటులు: దుర్గా దేవ్ నాయుడు, అన్విష, కిట్టయ్య. రూప కళ, కేదార్ శంకర్, ఫణీంద్ర దేవరపల్లి, అశోక్ ఆంధ్రా, సిరి జూపల్లి మరియు ఇతరులు
సంగీతం: NS ప్రసు
ఎడిటింగ్: శివ మంచాల
ఛాయాగ్రహణం: S నాగార్జున
నిర్మాత: తాటి బాలకృష్ణ
రచన & దర్శకత్వం: దుర్గా దేవ్ నాయుడు
కే ఫిలిమ్స్ బ్యానర్ పై దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇది. అన్విష హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే కథ, దర్శకత్వం, నటన మూడు బాధ్యతలు తీసుకుని దుర్గా దేవ్ ధైర్యం చూపించాడు. 2009 నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ స్వచ్ఛమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
కథ:
2009లో ఓ పల్లెటూరికి మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన టౌన్ డాక్టర్ పై, అదే ఊరి సాదాసీదా కుర్రాడు తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె అతని ప్రేమను అంగీకరిస్తుందా, ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి ఒప్పుకుంటాయా అనేది కథ. ఆస్తులు, అంతస్తుల తేడా ఉన్నా ప్రేమ ముందు అన్ని అడ్డంకులు చిన్నవే అని చూపించే ప్రయత్నం చేశారు. సాదాసీదా కథ అయినా ఎమోషనల్ కనెక్ట్ బాగా కుదిరింది.
నటీనటుల పనితీరు
దుర్గా దేవ్ నాయుడు హీరోగా అచ్చమైన గ్రామీణ యువకుడిగా సహజంగా ఇమిడిపోయాడు. మాట, నడక, చూపుల్లో గ్రామీణత్వం కనిపిస్తుంది. ప్రేమలో ఉత్సాహం, తిరస్కరణతో బాధ, క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ అన్నింటిలో నటన నిజాయితీగా అనిపిస్తుంది. తొలి చిత్రమే అయినా స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది.
అన్విష డాక్టర్ పాత్రలో గ్లామర్ కు పోకుండా సహజంగా నటించింది. పల్లెటూరి డాక్టర్ గా ఆమె మేనరిజం, డైలాగ్ డెలివరీ బాగా కుదిరాయి. హీరోతో కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తుంది.
కిట్టయ్య హీరో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు. అనుభవంతో ఆ పాత్రకు జీవం పోశాడు. రూపకళ ఇతర పాత్రలు కూడా కథకు బలం చేకూర్చాయి. మిగిలిన నటులు తమ పరిధిలో మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సాంకేతికంగా సినిమా బాగుంది. కెమెరామెన్ నాగార్జున 2009 నాటి పల్లె వాతావరణాన్ని అందంగా చిత్రీకరించాడు. సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ ను మరింత బలపరిచాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. మొదటి సినిమాలోనే దుర్గా దేవ్ దర్శకుడిగా ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం అభినందనీయం. మొత్తంగా ఐ యామ్ హ్యాండ్సమ్ క్లీన్ ఫ్యామిలీ లవ్ స్టోరీ. స్వచ్ఛమైన ప్రేమ, కుటుంబ బంధాలతో కూడిన ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంది.
బలాలు
సహజ నటన
పల్లె అందాలు
ఎమోషనల్ క్లైమాక్స్
మంచి సంగీతం
బలహీనతలు
రెగ్యులర్ కథ
నెమ్మది గా సాగే సన్నివేశాలు
విశ్లేషణ
మొదటి భాగం అంతా పల్లెటూరి వాతావరణంతో, మెడికల్ క్యాంప్ సందడితో ఫ్రెష్ గా సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య చిన్న చిన్న సన్నివేశాలు, చూపులతో చెప్పే ప్రేమ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. రెండో భాగంలో కుటుంబ భావోద్వేగాలు, అంతస్తుల తేడా వల్ల వచ్చే సమస్యలను దర్శకుడు సున్నితంగా చూపించాడు. క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.
రేటింగ్: 2.75
చివరగా: తండ్రి కొడుకుల బంధం నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథ



