కింగ్ నాగార్జున మ్యాసియస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ – ఆగష్టు 28న 4కె ఫార్మాట్‌లో బ్లాక్‌బస్టర్ ‘మాస్’ రీ-రిలీజ్

0
58
కింగ్ నాగార్జున బర్త్ డే (ఆగస్టు 29) ఎక్స్ ట్రార్డినరీ సెలబ్రేషన్ కి సిద్ధంగా ఉండండి. నాగార్జున పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ఆగష్టు 28న, ఐకానిక్ మూవీ ‘మాస్’ మళ్ళీ థియేటర్స్ లోకి వస్తోంది. 4K ఫార్మాట్‌లో గ్రాండ్ గా రీరిలీజ్ కానుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ‘మాస్’ అప్పటికి నాగార్జునకు హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ‘మాస్ ‘చిత్రాన్ని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి కౌర్, రఘువరన్, రాహుల్ దేవ్‌తో సహా ప్రముఖ నటీనటులు నటించారు.
మాస్ కమర్షియల్ హిట్ తో పాటు రాక్‌స్టార్ దేవి శ్రీ కంపోజ్ చేసిన అద్భుతమైన ఆల్బమ్ మ్యూజికల్ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘మాస్’ 4K ఫార్మాట్‌లో రీరిలీజ్ కానుండటంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి అద్భుతంగా ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు ప్రేక్షకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here