హీరో విజయ్ ఆంటోనీ “తుఫాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్

0
45

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మాటలు, పాటల రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ – “తుఫాన్” ఆగస్టు 2న థియేటర్స్ లోకి వస్తోంది. మంచి స్క్రీన్ ప్లే ఉన్న చిత్రమిది. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలాగే డబ్బింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. “తుఫాన్” సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్. అన్నారు.

 

సింగర్ సాకేత్ కొమండూరి మాట్లాడుతూ – “తుఫాన్” సినిమాకు అచ్చు రాజమణి గారు చేసిన మ్యూజిక్ విని హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్ లో చూడండి. థియేట్రికల్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. అన్నారు.

నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ – మా “తుఫాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దర్శకుడు కరుణాకరన్ గారికి థ్యాంక్స్. ఈ మూవీలో ఒక స్పెషల్ రోల్ చేసిన సత్యరాజ్ గారు ఈ ఫంక్షన్ కు రావడం హ్యాపీగా ఉంది. “తుఫాన్” ఒక క్వాలిటీ, కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమా. మ్యూజిక్ తో పాటు మంచి డైలాగ్స్ ఉంటాయి. విజయ్ ఆంటోనీ మిమ్మల్ని ఈ సినిమాతో ఆకట్టుకుంటారు. చాలా మంది ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. మా రైటర్ భాష్యశ్రీ మంచి డైలాగ్స్ రాశారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు 2న థియేటర్స్ లో “తుఫాన్” చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి మాట్లాడుతూ – “తుఫాన్” సినిమాలో నాతో వర్క్ చేసిన సింగర్స్, లిరిసిస్ట్ లకు థ్యాంక్స్. మాగ్జిమమ్ ఎఫర్ట్స్ ఈ సినిమా కోసం పెట్టాం. డైరెక్టర్ విజయ్ మిల్టన్, హీరో విజయ్ ఆంటోనీ, ఇతర టీమ్ అందరికీ థాంక్స్. సత్యరాజ్ గారు, నా ఫేవరేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చూసి నా మ్యూజిక్ ఎలా ఉందో చెప్పండి. అన్నారు.

డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ – “తుఫాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారు, నా ఫేవరేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారి సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా 30 ఏళ్ల క్రితం పనిచేశాను. ఇప్పుడు ఆయనతో డైరెక్టర్ గా వర్క్ చేయడం బ్లెస్సింగ్ గా భావిస్తున్నా.  అచ్చు రాజమణి గారి మ్యూజిక్ “తుఫాన్” సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కొన్నేళ్ల నుంచి ఆయన నా టీమ్ మెంబర్ గా ఉంటూ వస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ గారు తన సపోర్ట్ నాకు ఇస్తూనే ఉన్నారు. మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారికి థ్యాంక్స్. “తుఫాన్” సినిమాను థియేటర్స్ లో ఆగస్టు 2న చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ కరుణాకరన్ మాట్లాడుతూ – డైరెక్టర్ విజయ్ మిల్టన్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటినుంచి మంచి మిత్రుడు. ఆయన సినిమాలన్నీ బాగుంటాయి. “తుఫాన్” సినిమాలోనూ ప్రతి షాట్ బాగుంది. నా ఫ్రెండ్ శశి డైరెక్ట్ చేసిన బిచ్చగాడు సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలాగే తెలుగులో “తుఫాన్” సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు “తుఫాన్” సినిమా చేశారు. ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. ఈ మూవీలోని క్వాలిటీ, కంటెంట్ మనకు తప్పకుండా సక్సెస్ ఇస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారు తన బీజీఎంతో మా మూవీని మరింత ఎఫెక్టివ్ గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ లో మీ మ్యూజిక్ విని సర్ ప్రైజ్ అయ్యాను. మనం ఫ్యూచర్ లోనూ కలిసి మూవీస్ చేయాలి. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్ తో, తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. “తుఫాన్” సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా. అన్నారు.

యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా తమిళ ట్రైలర్ లాంఛ్ లో నా స్పీచ్ కు చాలా మీమ్స్ వచ్చాయి. ఈ మూవీలో లాస్ట్ మినిట్ నేను జాయిన్ అయ్యాను. నా క్యారెక్టర్ ను దర్శకుడు విజయ్ మిల్టన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. నా లుక్, మేకోవర్ అంతా కొత్త ఉంటుంది. ప్రొడ్యూసర్ ధనుంజయన్ చిన్న పిల్లాడి ఫేస్ తో ఉంటారు. ఆయన అడిగితే ఏదీ కాదని చెప్పాలనిపించదు. విజయ్ ఆంటోనీ కి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ను ఎలా వేర్వేరుగా చూసుకోవాలో తెలుసు. ఆయన ఒక ఫిలాసపర్. ఆయన జీవితంలో ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొంటారు. నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేయాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్
డిజైనర్ – తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి
ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here