మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’లో ఎగ్జయిటింగ్ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను తెలియజేసిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్

0
47

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ అత్య‌ద్భుతంగా, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

‘దేవర’లో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేయనున్న కొత్త పాట చిత్రీకరణ కోసం టీమ్ థాయిలాండ్ వెళ్లింది. పఠాన్, వార్, ఫైటర్ వంటి చిత్రాల్లో అద్భుతమైన స్టెప్స్‌ను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్‌గా బాస్కో మార్టిస్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి పని చేస్తుండటంపై బాస్కో ఎగ్జయిట్ అయ్యారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేయటం ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

బాస్కో షేర్ చేసిన ఆ ఫొటోలో ఫ్రెష్ లుక్‌తో ఉన్న ఎన్టీఆర్‌ను చూడొచ్చు. ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభను బాస్కో కొనియాడారు. అలాగే బిహైండ్ సీన్స్‌కు సంబంధించిన గ్లింప్స్ అందరిలోనూ అంచనాలను మరింతగా పెంచాయి. ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి స్టార్‌కు బాస్కో మార్టిస్ నృత్యరీతులను కంపోజ్ చేయటమనేది అందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇటీవల ‘ఫియర్ సాంగ్’ను రిలీజ్ చేయటం ద్వారా ఫిల్మ్ మేకర్స్ ‘దేవర’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అన్నీ మాధ్యమాల్లో గ్లోబల్ రేంజ్‌ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.

‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here