వీకే మూవీస్ & శ్రీ జె పి ప్రొడక్షన్స్ పతాకాలపై జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా ఉమా శంకర్ రెడ్డి నిర్మాతగా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా, అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `వృషభ`. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డిగారి జయంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సీనియర్ దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ…“ట్రైలర్ తో పాటు ఒక పాట విన్నాం చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచరల్ గా ఉన్నారు. దర్శకుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాలని కోరుకుంటూ నిర్మాతకు శుభాకాంక్షలు “ అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ…“ట్రైలర్ చూడగానే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జయప్రకాశ్ రెడ్డి గారి కూతురు నిర్మాతగా చేయడం సంతోషం. ఈ చిత్రం దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు“ అన్నారు.
సీనియర్ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…“ ట్రైలర్, విన్న పాట , టైటిల్ చాలా బావున్నాయి. కళ పట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసినట్లు అర్థమవుతోంది. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…“జయ ప్రకాష్ రెడ్డి గారి కూతురు ఈ సినిమాతో కో ప్రొడ్యూసర్ గా పరిచయం అవుతున్నారు. ట్రైలర్, మ్యూజిక్ బాగుంది. గోమాత మీద సినిమా తీయడం ఇదే ప్రథమం. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ…“జేపీ గారి కుమార్తె మల్లికా రెడ్డి గారి కోసం ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను. మట్టి వాసనతో కూడిన కథ ఇది. ట్రైలర్… నేచరల్ గా చాలా బావుంది. ఇలాంటి కథలతో సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఈ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
నటుడు శివారెడ్డి మాట్లాడుతూ..“ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. హీరో, హీరోయిన్స్ చాలా నేచరల్ గా కనిపించారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. దర్శకుడు టాలెంట్ ఏంటో ట్రైలర్ చూస్తే అర్థమయింది“ అన్నారు.
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ..“వృషభ` ట్రైలర్ చాలా కొత్తగా అనిపించింది. చాలా నేచరల్ గా సినిమా చేశారు. యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
శబరి నిర్మాత మహేంద్ర మాట్లాడుతూ..“నిర్మాతలు ఒక ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ట్రైలర్ , సాంగ్ చాలా బావుంది“ అన్నారు.
చిత్ర నిర్మాత ఉమా శంకర్ రెడ్డి మాట్లాడుతూ..“నాలుగేళ్ల పాటు ఈ స్టోరి రాసుకున్నాం. ఎన్నో రాత్రులు ఈ సినిమా కోసం శ్రమించాం. 85 శాతం సినిమా పూర్తయంది. దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు. టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా కోసం ఎందాకైనా వెళ్తే వ్యక్తి మా హీరో. అలాగే మా హీరోయిన్ కూడా ఎంతో కష్టపడ్డారు. మ్యూజిక్ డైరక్టర్ ఎమ్ ఎల్ రాజా అద్భతమైన సంగీతాన్ని సమకూర్చారు. త్వరలో సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడిస్తాం“ అన్నారు.
మ్యూజిక్ డైరక్టర్ ఎమ్ ఎల్ రాజా మాట్లాడుతూ…“నాకు ఈ చిత్రాన్ని ఇచ్చి మంచి పాటలు చేయడానికి సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు.
కో-ప్రొడ్యూసర్ మల్లిక రెడ్డి మాట్లాడుతూ…“మా నాన్నగారి బర్త్ డే రోజు మా సినిమాకు సంబంధించిన పాట, ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం. ఈ సినిమాలో నన్ను భాగస్వామిగా చేసిన ఉమా శంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు . ఒక మంచి సినిమాలో పార్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు.
దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ…“ మా ప్రొడ్యూసర్ ఉమా శంకర్ గారు ఒక మంచి కథ రాసుకొని నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వర్క్ చేసాం. టీమ్ అంతా ఎంతో బాగా సహకరించారు. హీరో జీవన్ రెడ్డి గారు సినిమా కోసం ప్రాణం పెట్టారు. హీరోయిన్ కూడా ఎంతో శ్రమించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. ఎమ్ ఎల్ రాజా నాకు మంచి మిత్రుడు. అద్భుతమైన పాటలిచ్చారు. త్వరలో మిగతా పాటలు రిలీజ్ చేస్తాం“ అన్నారు.
హీరోయిన్ అలేఖ్య మాట్లాడుతూ…“మా సినిమా ట్రైలర్, ఈ రోజు విడుదలైన పాటను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా“ అన్నారు.
మురళీ కృష్ణ రెడ్డి, గడ్డం నవీన్, రాజమౌళి, సద, ఫైమా, భాస్కర్, మురళి, జనార్థన్, కృష్ణ చైతన్య, రాజేశ్వరి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపిః యుఎస్ విజయ్, సంగీతంః ఎమ్ ఎల్ రాజా, ఎడిటర్ః మహేంద్ర నాథ్, స్టంట్స్ః జాషువా; కొరియోగ్రాఫర్ః కె.అనీష్ బాబు, సాగర్, రాజా ఎమ్ ఎల్; పాటలుః రామాంజనేయులు, ఎమ్ ఎల్ రాజా; కో-ప్రొడ్యూసర్ఃశ్రీ మల్లికా రెడ్డి; స్టోరి-డైలాగ్స్-ప్రొడ్యూసర్ః ఉమా శంకర్ రెడ్డి.సి; స్క్రీన్ ప్లే-డైరక్షన్ః అశ్విన్ కామరాజ్ కొప్పాల.